అభిమానుల సమక్షంలో ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు

Edari Rama Krishna

నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేశారు. బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ హాస్పిటల్ లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాన్సర్ బాధిత చిన్నారులతో సరాదాగా గడిపిన బాలకృష్ణ జన్మదిన వేడుకల్లో పాల్గొని రక్తదానం, అన్నదానం సహా వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అభిమానులను అభినందించారు.


బాలకృష్ణ,బోయపాటి శ్రీను


బాలకృష్ణ అభిమానులు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భారీ కేక్ ను ఆయన అభిమానుల సమక్షంలో కట్ చేశారు. ఈ పుట్టినరోజు వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్, బసవతారకమ్మ కాన్సర్ హాస్పిటల్ సి.ఇ.ఓ ఆర్.పి.సింగ్ తదితరులు పాల్గొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: