వర్మకు గట్టి షాక్ ఇచ్చారు..!!

Edari Rama Krishna

తన విచిత్రమైన మనోభావాలు ట్విట్టర్ లో పోస్టు చేస్తూ సంచలనాలకు కేంద్రబింధువుగా నిలుస్తున్నాడు రాంగోపాల్ వర్మ. ఇప్పుడు ఆయన అభిమానులు కాస్త గట్టిగానే షాక్ ఇచ్చారు. ఆయన అంటే ఎవరనుకుంటున్నారు మమ్మట్టి అభిమానులు.   అవును ఇటివలే వచ్చిన ఓకే బంగారం సినిమా సమయం లో మమ్ముట్టి తనయుడు దుల్కర్ గురించి మాట్లాడుతూ .. మమ్ముట్టి తన కొడుకు వద్దే నటనలో శిక్షణ తీసుకుంటే బాగుంటుందని ఘాటు కామెంట్ చేసాడు. దీంతో మమ్ముట్టి అభిమానులు అసలు రాంగోపాల్ వర్మకు మమ్ముట్టి గురించి ఏం తెలుసు.

In ten lifetimes I won't be one millionth the actor my father is, no matter what I accomplish.

— dulquer salmaan (@dulQuer) April 21, 2015

మళియాంలో ఆయనకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో తెలియకుండా పిచ్చి పిచ్చిగా కామెంట్ చేయడం మంచింది కాదు అంటూ వార్నింగ్ ఇచ్చారు. అంతే కాదు మమ్ముట్టి తనయుడు దుల్కర్ స్పందిస్తూ నాన్న చాలా గొప్ప నటుడు ఆయనలా నటించాలంటే నాకు వంద జన్మలెత్తినా చేయలేను అంటూ ట్విట్ చేశాడు.


మమ్ముట్టి, రాంగోపాల్ వర్మ


దీనికి రాంగోపాల్ వర్మ స్పందిస్తూ తాను ట్విట్  చేసింది అలా కాదని అందరూ అపార్థం చేసుకున్నారని తను దుల్కర్ ని మెచ్చుకున్నా అంతేకాని మమ్ముట్టిని విమర్శించలేదు అని జవాబు ఇచ్చాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: