ఆ వర్గం వారు రాజేంద్రున్ని ఆదరిస్తారా..!!

Edari Rama Krishna

తెలుగు చలన చిత్రసీమాలో ఇప్పుడు వర్గపోరు చాప కింద నీరులా విస్తరిస్తుంది. ఈ విషయం ‘మా’ అధ్యక్ష ఎన్నకల సమయంలో బాహాటంగానే బయట పడింది. సాఫీగా సాగిపోయే ‘ మా ’ ఎలక్షన్స్ ఎంతటి ఉత్కంఠ కు తెరలేపిందో అందరికీ తెలుసు. నువ్వా నేనా అంటూ వర్గ పోరులు మొదలయ్యాయి. ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్స్ పెట్టి మరి దూషించుకున్నారు. టాలీవుడ్  కామెడీ యాక్టర్ హేమ ఒక అడుగు ముందుకు వెసి గతంలో మా అధ్యక్షులుగా ఉన్న నాగబాబుపై సెటైర్లు, ఆరోపణలు చేసింది. దీనికి కౌంటర్ గా నాగబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆ వర్గం వారు కాస్త  నోరు సంబాలంచుకోవాలని చెప్పారు.


నాగబాబు పై ఆరోపణలు చేస్తున్న హేమ


శివాజీ రాజ తుప్పుపట్టిన అస్త్రం మాపైకి వదిలారు అన్న మాటను సీరియస్ గా తీసుకొని హేమ ఓ టీవీ చానల్ ముందు రాజేంద్ర ప్రసాద్ కారు ఆపి క్షమాపణలు కోరింది. అక్కడ హల్ చల్ చేసింది. ఇలా దూషనలు, ఆరోపణల మధ్య ఎలక్షన్స్ జరిగాయి. రాజేంద్రుడికి ‘మా’ అధ్యక్షడిగా పట్టం కట్టారు. ఇప్పుడు మరి ఆ రేంజ్ లో ప్రెస్ మీట్స్ పెట్టి మరీ కడిగిపారేసిన ఆ వర్గం వారు మరి రాజేంద్రుడి పట్ల ముందు ముందు ఎలాంటి కండీషన్స్ అప్లై అంటారో .. రాజేంద్ర ప్రసాద్ ఇప్పటికే దూకుడు పెంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసాడు.


ఇద్దరు సీఎం లు చంద్రబాబు, కేసీఆర్ లతో రాజేంద్రప్రసాద్


దీనిపై అప్పుడే కౌంటర్ పడింది. కామెడీ హీరో నరేష్ ‘మా’ అధ్యక్షుడి తీరు బాగలేదని ఇండస్ట్రీలో కొంతమంది పెద్దలే ఉన్నారా.. కృష్ణ, దాసరి, మోహన్ బాబు లాంటి వాళ్లను రాజేంద్రుడు కలవలేదని ఇది మంచి పద్దతి కాదని ఆరోపించాడు. ఇలా కత్తిమీద సాములాంటి అధ్యక్ష పదవి చేపట్టి అందరిని సంతృప్తి పరుస్తాడా లేద కొంత మంది బలం, బలగంతో ముందుకు పోతాడా అనేది ముందు ముందు వేచి చూడాల్సిదే.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: