3 రోజులు 30 కోట్ల రూపాయల కలెక్షన్స్

E. Rama Krishna
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ ఫిల్మ్ అంజాన్. అంజాన్ మూవీ రిలీజ్ అయి నేటికి మూడు రోజులు పూర్తి చేసుకుంది. సూర్య ఫిల్మ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ ఫిల్మ్ గా అంజాన్ మూవీ తెరకెక్కింది. దాదాపు 50 కోట్ల రూపాయలకి పైగా ఈ మూవీ బడ్జెట్ ఉందని చిత్ర వర్గాల నుండి అందిన సమాచారం. అయితే ఇంత భారీ బడ్జెట్ మూవీకి రిలీజ్ తరువాత నష్టాలు తప్పవు అంటూ కోలీవుడ్ లోని ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ లు లెక్కలు వేసుకున్నారు. అయితే వీరి లెక్కలకు భిన్నంగా ప్రస్తుతం అంజాన్ మూవీ బాక్సాపీస్ ని షేక్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఆగష్టు 15న సిల్వర్ స్క్రీన్ ని హిట్ చేసిన అంజాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. అంజాన్ మూవీ మొదటి మూడు రోజుల కలెక్షన్స్ దాదాపు ముఫ్పై కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్స్ లెక్కలు చూపిస్తున్నాయి. తమిళ్ లో అంజాన్ మూవీ మొదటి మూడు రోజుల కలెక్షన్స్ 11.5 కోట్ల రూపాయలుగా నిర్మాతలు అఫిషియల్ స్టేట్ మెంట్ ఇచ్చారు. అలాగే తెలుగులో సికిందర్ గా డబ్ అయిన ఈ మూవీకి టాలీవుడ్ లో బాక్సాపీస్ వద్ద చెప్పుకోదగ్గ కలెక్షన్స్ తో ముందుకుపోతుంది. కోలీవుడ్ కి ధీటుగా టాలీవుడ్ లో సికిందర్ మూవీ కలెక్షన్స్ 11.85 కోట్ల రూపాయలుగా లెక్కలు చెబుతున్నాయి. ఇలా మొత్తంగా చూసుకుంటే సూర్య నటించిన అంజాన్ మూవీ కలెక్షన్స్ దాదాపు 30 కోట్ల రూపాయలను మించి ఉంది. మూవీకి అన్ని చోట్ల నుండి కలెక్షన్స్ రావడంతో నిర్మాతలు హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి. అయితే అంజాన్ మూవీ లాభాల్లోకి వెళుతుందా? లేదో? తెలియాలంటే మరి కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: