పవన్ రేణుదేశాయ్ లు విడిపోయినా వారిద్దరికి సంబంధించిన వార్తల హడావిడి మీడియాలో కొనసాగుతూనే ఉంది. మరాఠీ భాషలో రేణుదేశాయ్ కు మంచి పేరు తెచ్చి పెట్టిన 'ఇష్క్ వాలా లవ్' సినిమాను తెలుగులో రేణు డబ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేస్తాడని రేణుదేశాయ్ తన ట్విట్టర్ ద్వారా ఇంతకు ముందుప్రచారం చేసింది.
అయితే ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి పవన్ రాలేకపోతున్నాడు. దీనితో పవన్ రాకపోవడానికి గల కారణాలను వివరణ ఇస్తూ ఆమె మరో విధంగా ట్విట్ చేసింది. “పవన్ కల్యాణ్ తన సినిమా చిత్రీకరణలో బిజీగా ఉండటం, కాస్త వెన్ను నొప్పితో బాధపడుతుండటం వల్ల రాలేకపోతున్నారు''అంటూ పవన్ వెన్ను నొప్పి విషయాన్ని రేణు మరోసారి వార్తలలోకి తీసుకు వచ్చింది.
అంతేకాదు పవన్ శుభాకాంక్షలు తెలుపుతూ సంతకం చేసిన పాటల సీడీని ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి రాకపోయినా పవన్ సంతకం పెట్టిన సీడీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మారుతుంది అనుకోవాలి.
పవన్ అభినందనలు రేణు దేశాయ్ కు మరోసారి లభించాయి కాబట్టి తన సినిమాల విషయంలో రేణు మరింత స్పీడ్ ను పెంచుతుంది అనుకోవాలి.
మరింత సమాచారం తెలుసుకోండి: