మలయాళ సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ ఉన్న నటలలో పహాద్ ఫాజల్ ఒకరు. ఈయన కొంతకాలం క్రితం అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన "పుష్ప పార్ట్ 1" మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించడం , అలాగే ఇందులో పహాద్ నటన అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ద్వారా ఈయనకు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది.
ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు "పుష్ప పార్ట్ 2" లో నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే పహాద్ క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈయన ఆవేశం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మలయాళ బాషలో థియేటర్ లలో విడుదల అయ్యి ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటున్న ఈ సినిమా "ఓ టి టి" ఎంట్రీ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు అందులో భాగంగా మే 9 వ తేదీ నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ మలయాళం లో పాటు మరికొన్ని భాషల్లో కూడా స్ట్రీమింగ్ లోకి అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తుంది.