ఏపీ: చంద్రబాబు గెలుపు ధీమా అదేనా?

Suma Kallamadi

ఏపీలో ఎన్నికవేళ రాజకీయ వాతావరణం వేసవి వేడిమిని మించిపోతుంది అని అనడంలో అతిశయోక్తి లేదు. అవును, విపక్షాలు తమదైన రీతిలో ప్రచారాన్ని షురూ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెల్లూరులోని నర్తకి సెంటర్‌లో పవన్‌ కళ్యాణ్‌తో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ వేదికగా చంద్రబాబు ఎన్నో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. ఈ వేదిక సాక్షిగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర యువతకు బంగారు భవిష్యత్తును అందించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు బాబు.
రాబోయే ఎన్నికల్లో కూటమి 160కి పైగా అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని బాబు ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం కూలదోస్తుంది అని చేస్తున్న జగన్ రెడ్డి వాదనలు నిరాధారమైనవి. జగన్ రెడ్డి ప్రజలకు రూ.10 ఇచ్చి రూ.100 దోచుకుంటున్నారు. కట్ చేస్తే 13 లక్షల కోట్ల అప్పులు చేశాడు. దీనికి విరుద్ధంగా, మేము సంపదను ఉత్పత్తి చేయడం, ఆదాయాన్ని పెంచడం.. పౌరులకు సమానమైన పంపిణీని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇక అధికారంలోకి రాగానే మెరుగైన సంక్షేమం అందిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సైకోను సాగనంపాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు పిలుపు నిచ్చారు.
జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌ అత్యంత ప్రమాదకరం అని పరిశోధకులే చెబుతున్న పరిస్థితి. ఎందుకంటే తీసుకొచ్చారని దీని ప్రకారం పట్టాదారు పాసు పుస్తకం ఉండదని, దస్తావేజులు ఉండవని చంద్రబాబు అన్నారు. భూముల రికార్డులన్నీ ఆన్‌లైన్‌లోనే ఉంటాయని.. ఆస్తులు అమ్మాలన్నా, కొనాలన్నా జగన్‌ అనుమతి కావాలని చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులపై జగన్‌ పెత్తనం ఎందుకని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం, రెండో సంతకంగా ల్యాండ్‌ గ్రాబింగ్‌ చట్టం రద్దుపై చేస్తానని తెలిపారు బాబు. అదేవిధంగా ముస్లింలకు ప్రత్యేక బడ్జెట్‌ తీసుకొస్తామని వారి కోసం హజ్‌హౌస్‌ నిర్మిస్తామన్నారు. ముస్లిం సోదరులకు మక్కా యాత్రలకు రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు. మౌజమ్‌, ఇమామ్‌లకు గౌరవ వేతనం పెంచుతామన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: