ఏపీ: బీజేపీకి ఝలక్కిచ్చిన కేతిరెడ్డి.. అదేంటి అంత మాటనేశాడు?

Suma Kallamadi

వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి  గురించి ఆంధ్రా ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేతిరెడ్డి మిగతా నాయకులిలాగా కాకుండా కొత్తపంథాలో జనాలను ఆకర్శించుకున్నారు. ఇక ఏపీలో ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలకు, అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు బహిరంగ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ధర్మవరంలో రాజకీయం చేయడానికి ఢిల్లీ నుంచి వచ్చారు? చూడండి... ఇదెక్కడి చోద్యం? ఎక్కడి నుంచి వచ్చారో వారిని ప్రజలు అక్కడికే పంపుతారు. రాజకీయాలు ఎమన్నా ఉంటే వారు అక్కడే చేసుకోవాలి. ఇక్కడ రాజకీయం చేసుకోవడానికి వారికి ఎటువంటి అర్హతలు లేవు.
అవును, తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా, కేతిరెడ్డి మాట్లాడుతూ... "ధర్మవరంలో రాజకీయం చేయడానికి ఢిల్లీ నుంచి బ్రోకర్లు దిగిపోయారు. అంతిస్తాం.. ఇంతిస్తాం! అంటూ రాజకీయం చేస్తున్నారు. తాడు బొంగరం లేని వారు ఈ కేతిరెడ్డిని వారు శాసిస్తారా? డేట్ రాసుకో.. ఏ ఊరి నుంచి వచ్చారో అక్కడికే నెలలోపు మడతెట్టకపోతే నా పేరు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి కాదు అంటూ మధ్య మధ్యలో పరుష పదజాలాన్ని విరివిగా ఉపయోగించడం జరిగింది. ఇంకా ఆయన మాట్లాడుతూ ... "ఇదే ముదిగుబ్బ సెంటర్‌లో గత ఎన్నికలపుడు చెప్పాను మీకు. మా వాళ్లను ముట్టుకుని పొలిమేర దాటలరేన్నా, ఐదేళ్ల తర్వాత ఇదే చెప్తున్నా.. ఎవరైనా వచ్చారా.. ముట్టుకున్నారా?" అంటూ అని కార్యకర్తలను ఉద్దేశించి అడిగారు.
ఇంకా కేతిరెడ్డి మాట్లాడుతూ... ఆంధ్రా రాజకీయం నాకు ఎందుకో నచ్చట్లేదు. ఇక్కడ పోటీ చేసేందుకు మొదటి సూరి, ఆ తర్వాత పరిటాల శ్రీరామ్, జనసేన అంటూ ఇంకొకరు రావడం జరిగింది. ఇక కొత్తగా ఢిల్లీ నుంచి వచ్చారు మహానుభావులు. అక్కడేం చేయలేని వారు ఇక్కడికొచ్చి ఏం చేయగలరు? ఇక్కడ కేతిరెడ్డికి బలం గురించి అందరికీ తెలిసిందే. అందుకే ఒక్క కేతిరెడ్డిని ఎదుర్కొనేందుకు హీరోయిన్లు, కేంద్ర మంత్రులు వస్తున్నారు! అయితే నేను నమ్ముకుంది జనాల్ని. కేవలం ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండకూడదనే పదేళ్లుగా గొడవల్లేకుండా చూసుకున్నాం అని అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: