గెలవకముందు అలా గెలిచాక అలా.. బాబు గతంలో ఇచ్చిన మోసపూరిత హామీలివే!

Reddy P Rajasekhar
ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే ఓటర్ల మెప్పు పొందే అద్భుతమైన మేనిఫెస్టో అవసరం అని చంద్రబాబుకు బాగా తెలుసు. ఏ మాత్రం సాధ్యం కాని హామీలు ఇచ్చే చంద్రబాబు ఆ హామీల అమలు ఎలా అని ఎవరైనా ప్రశ్నిస్తే గెలిచాక చూసుకుందామని భావించేవారు. ఐదేళ్ల పాలనలో కేవలం 6 నెలలు అమలు చేసిన హామీలను సైతం గొప్పగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకే చెల్లిందని చెప్పవచ్చు.
 
ఇంటికో ఉద్యోగం అంటూ తరచూ ప్రచారం చేసే బాబు 25 సంవత్సరాల క్రితం 1999లో ఏకంగా కోటి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా ఈ హామీని అమలు చేయలేదు. 2014 సంవత్సరం 2019 సంవత్సరం మధ్య బాబు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. అయితే మళ్లీ గెలిపిస్తే మాత్రం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు అంటూ బాబు, ఆయన అనుకూల మీడియా ప్రచారం చేసుకుంటున్నారు.
 
జగన్ సర్కార్ ఇంటింటికీ రేషన్ పంపిణీ చేయడంపై విమర్శలు చేస్తున్న చంద్రబాబు 1999లో ఇంటింటికీ రేషన్ సరుకులు అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ అమలు చేయడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. 2014 ఎన్నికలకు ముందు రుణమాఫీ హామీ ఇచ్చిన బాబు అధికారంలోకి వచ్చాక  ఐదు విడతల్లో హామీని అమలు చేస్తామని చెప్పారు. ఆ ఐదు విడతల్లో మూడు విడతల నగదు మాత్రమే జమయింది. వడ్డీల భారం వల్ల రైతులకు రుణమాఫీ వల్ల కలిగిన ప్రయోజనం దాదాపుగా శూన్యం అనే చెప్పాలి.
 
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ ఇల్లు, మీ భూములు మీవి కావంటూ దుష్ప్రచారం చేస్తున్న పచ్చ మీడియా ఆగడాల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై విమర్శలు చేయడం పచ్చ పత్రికలకే చెల్లింది. విజనరీ అని చెప్పే చంద్రబాబు 2014 నుంచి 2019 వరకు ఎన్ని సంక్షేమ పథకాలను అందించారో, ఎంత అభివృద్ధి చేశారో ఏపీ ప్రజానీకానికి బాగా తెలుసు. మరోసారి బాబు మోసపూరిత హామీలతో అధికారం కోసం ప్రయత్నిస్తున్నారని విజ్ఞులైన ఓటర్లు బాబు, జగన్ పాలనలను పోల్చుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయం తీసుకోవాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: