మోదీని ఒక ఆట ఆడేసుకున్న రాహుల్ గాంధీ.. ఈ కోణం కూడా ఉందా..?

Suma Kallamadi
మొన్నటిదాకా తిరుగులేని నాయకుడు, శ్రీరాముడు వంటి పరిపాలికుడు అంటూ మోదీని భారతదేశ ప్రజలు తెగ పొగిడేశారు. కానీ ఇప్పుడు ఆ ప్రజలే ఆయన్ను గద్దె దింపడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఈసారి బీజేపీకి పార్లమెంటు స్థానాల సంఖ్య చాలా తగ్గే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్ సర్వేల్లో, సరళిలో కూడా అదే కనిపిస్తోంది. మోదీ పాపులారిటీ తగ్గుతున్న వేళ రాహుల్ గాంధీకి ప్రజాదారణ పెరుగుతోంది. ఆయన స్పీచ్ లకు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ ఊపుతో రాహుల్ కూడా రెచ్చిపోతున్నారు. తాజాగా మోదీని ఒక ఆట ఆడేసుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఓ కాపీ క్యాట్ లాంటి వ్యక్తి అని విమర్శించారు. మోదీతో ఏమైనా చెప్పించగల శక్తి తనకి ఉందంటూ రాహుల్ గాంధీ ఎగతాళిగా మాట్లాడారు. మోదీ నోటి నుంచి ఏ మాటలు వినిపించకూడదని జనాలు కోరుకుంటారో, ఆ మాటలు కూడా తన నోటి నుంచి రాకుండా చేయగల సామర్థ్యం తనకు ఉంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ తాజాగా ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా యూపీలోని రాయ్‌బరేలిలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు ఆ సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఇటీవల అదానీ, అంబానీల పేర్లను ప్రస్తావించానని, దాంతో వారి పేర్లను ఎప్పుడూ తన ప్రసంగాలలో ప్రస్తావించినట్లు ఆయన గుర్తు చేశారు.
తలచుకుంటే మోదీతో ఎలాంటి మాటలైనా తాను మాట్లాడించగలనని అన్నారు. "రీసెంట్‌గా ‘మోదీజీ, మీరు అదానీ-అంబానీల పేర్లు ఎందుకు ఎప్పుడూ మీ నోటి నుంచి పలకరు’ అని క్వశ్చన్ చేస్తే, రెండు రోజుల్లో మోదీ అదానీ, అంబానీల పేర్లు పలికారు" అంటూ రాహుల్ చెప్పుకొచ్చారు. "పేదల బ్యాంకు ఖాతాల్లోకి ‘టకా-టక్ టకా-టక్’ డబ్బులు జమ చేస్తామని నేను హామీ ఇచ్చినప్పుడు.. మోదీ కూడా వెంటనే ‘టకా-టక్ టకా-టక్’ డబ్బుల గురించి మాట్లాడారు. ఇలా నేను ఏం చెప్తే వాటిని మోదీ వెంటనే తన ప్రసంగంలో ఉపయోగిస్తున్నారు" అని రాహుల్ వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ విధంగా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ పదాలను మోదీ నోటి నుంచి రెండు నిమిషాల్లో చెప్పించగలను కానీ తన ప్రసంగాన్ని ముగించారు. మరి బీజేపీ దీనిపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: