బుమ్రా మాస్ బౌలింగ్.. ఆ రికార్డు కూడా దాసోహం?

praveen
జస్ ప్రీత్ బూమ్రా.. ఈ పేరు తెలియని ఇండియన్ క్రికెట్ ప్రేక్షకుడు లేడు అనడంలో సందేహమే లేదు. ఎందుకంటే టీమిండియాలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లకు ఏ రేంజ్ లో అయితే క్రేజీ ఉందో బౌలర్ అయినప్పటికీ అటు బుమ్రాకి అదే రేంజ్ లో క్రేజీ ఉంది. సాధారణంగా ఇండియాలో బ్యాట్స్మెన్ లకు ఉన్నంత పాపులారిటీ బౌలర్లకు ఉండదు. కానీ బుమ్రా మాత్రం అది తప్పు అని నిరూపించాడు. ఎందుకంటే స్టార్ బ్యాట్స్మెన్ల రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక టీమ్ ఇండియాలో కోహ్లీ రోహిత్ తర్వాత ఏ ప్లస్ గ్రేడ్ సొంతం చేసుకున్న ఏకైక ప్లేయర్గా బౌలర్గా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.

 అయితే ఒక సాదాసీదా బౌలర్గా భారత జట్టులోకి వచ్చిన ఈ ఆటగాడు.. అతి తక్కువ సమయంలోనే తాను లెజెండరీ బౌలర్ అన్న విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా చేశాడు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా బుమ్రా బౌలింగ్ కి కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. అయితే టీమ్ ఇండియా కష్టాల్లో ఉన్న ప్రతిసారి కూడా తన అద్భుతమైన బౌలింగ్ ప్రతిభతో ఆదుకుంటూ ఉంటాడు ఈ స్టార్ ప్లేయర్. కాగా ఈ ప్రస్తుతం టీమిండియా బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడుతూ ఉండగా మరోసారి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇటీవల జరిగిన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా నాలుగు వికెట్లు తీసి బంగ్లా బ్యాటింగ్ విభాగాన్ని దెబ్బ కొట్టాడు.

 అయితే ఈ బౌలింగ్ తో ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు బుమ్రా. అంతర్జాతీయ క్రికెట్ లో 400 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ ఘనత సాధించిన ఆరో భారత ఫేసర్ గా నిలిచాడు. ఇప్పటికే కెరియర్ లో ఎన్నో అరుదైన రికార్డులు కొట్టేసిన బుమ్రా.. ఇక ఇప్పుడు ఈ రికార్డును కూడా వదలకుండా తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా బుమ్రా కంటే ముందు కపిల్ దేవ్ 687, జహీర్ ఖాన్ 597, జవగల్ శ్రీనాథ్ 551, షామీ 448, ఇషాంత్ 434 ఈ ఘనతను అందుకున్న బౌలర్లుగా బుమ్రా కంటే ముందు కొనసాగుతున్నారు. కాగా మొదటి టెస్ట్ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై టీమ్ ఇండియా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: