చంద్రబాబు:14 యేళ్లు సీఎం..40 ఏళ్ల ఎక్స్పీరియన్స్.. భయపెడుతున్న జగన్..!

Divya
ఏపీలోని మే 13వ తేదీన ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. ముఖ్యంగా ఏ పార్టీకి ఆ పార్టీ ధీమాతో ఉన్నప్పటికీ.. చాలామంది నేతలు సైతం భయాందోళనతో ఉన్నారు.. ముఖ్యంగా ఈసారి ఓటింగ్ ప్రక్రియ కూడా 81% పైగా నమోదు కావడంతో అందరూ ఏం జరుగుతుందా అంటూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.. ఓటింగ్ శాతం పెరగడం అనేది ఎవరికి కలిసి వస్తుందా అనే విషయం పైన కూడా సందిగ్గతతో ఉన్నారు. ముఖ్యంగా టిడిపి నేత చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పం పై కూడ భారీగానే బెట్టింగ్ జరుగుతోంది.

ముఖ్యంగా అక్కడ ఓటింగ్ శాతం కూడా పెరగడంతో ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. కుప్పంలో గెలుపు ఎవరిదని విషయం పైన రాష్ట్ర రాజకీయాలలో కూడా ఆసక్తి మారిపోయింది. ఇప్పటిదాకా చంద్రబాబు 7 సార్లు అసెంబ్లీకి వెళ్లారు.. 8వ సారి తన అదృష్టాన్ని సైతం పరీక్షించుకోబోతున్నారు. కుప్పంలో గెలవడమే కాకుండా లక్ష ఓట్ల మెజార్టీ అన్నట్లుగా టిడిపి చెబుతోంది. మరొకవైపు వైసీపీ పార్టీ గెలవడమే కాదు చంద్రబాబు ఓటమి కూడా చూడాలని అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి చాలా ధీమాతో ఉన్నారు.

ముఖ్యంగా 14 ఏళ్ల సీఎం.. 40 ఏళ్ల రాజకీయ ఎక్స్పీరియన్స్ అంటూ చంద్రబాబు చెబుతూ ఉంటారు.. అయినప్పటికీ కానీ ఈసారి ఎన్నికలలో కాస్త గెలుస్తానని ధీమా మాత్రం ఎక్కడ కనిపించలేదు..అలాగే కుప్పంలో ఈసారి చేయి జారకూడదని తన కుటుంబాన్ని సైతం రంగంలోకి దింపి ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు. కుప్పంలో కూడా ఈసారి 90 శాతం ఓటింగ్ పోలింగ్ అవ్వడంతో గెలుస్తానని ధీమా కనిపించడం లేదు. కాస్త భయం అయితే చంద్రబాబులో కనిపిస్తూనే ఉంది. అలాగే చంద్రబాబు కుప్పంలో ఆరు నెలల వ్యవధిలోనే మూడుసార్లు సైతం పర్యటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన భరత్ ను వైసీపీ పార్టీ కుప్పంలో నిలబెట్టింది. ముఖ్యంగా తనకి వైసిపి పార్టీ అండ ఉండడమే కాకుండా వైసిపి పార్టీ కుప్పంలో గెలిస్తే ఖచ్చితంగా క్యాబినెట్లోకి తీసుకుంటాను అంటూ సీఎం జగన్ అక్కడ ప్రజలకు మాట ఇచ్చారు. అలాగే మంత్రి పెద్దారెడ్డి కూడా తన నియోజకవర్గ కంటే కుప్పం పైన ఎక్కువగా ఫోకస్ చేశారు. దీంతో గతంలో 85% మించిన పోలింగ్ ఎన్నికలలో నమోదైనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి జనం ఏ పార్టీకి ఏ అభ్యర్థికి  ఓటు వేశారో తెలియక అటు నేతలు తలలు పట్టుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో జూన్ 4వ తేదీ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: