వరల్డ్ కప్ జట్టు ఎంపికపై విమర్శలు.. జై షా ఏమన్నాడో తెలుసా?

praveen
జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ కోసం అటు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈసారి యూఎస్ వెస్టిండీస్ వేదికలుగా ఈ ప్రపంచ కప్ టోర్నీ జరగబోతుంది. మొత్తంగా ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనబోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇక వరల్డ్ కప్ ప్రారంభానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇక ప్రత్యర్థులను ఎదుర్కునేందుకు వ్యూహాలను సిద్ధం చేసుకున్నాయ్. అయితే ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల జట్టు వివరాలను ప్రకటించాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే అటు బీసీసీఐ కూడా ఐసీసీ విధించిన డెడ్ లైన్ ప్రకారం వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను ప్రకటించింది. అయితే ఇలా బీసీసీఐ వరల్డ్ కప్ టీం ను విడుదల చేసిందో లేదో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఐపీఎల్ లో మంచి ఫామ్ లో ఉన్న ఆటగాళ్లను వరల్డ్ కప్ లోకి తీసుకోవడం మానేసి.. ఇక దారుణమైన ప్రదర్శన చేస్తున్న ప్లేయర్లను వరల్డ్ కప్ టోర్నికి ఎంపిక చేయడం ఏంటి అంటూ అందరూ విమర్శలు గుర్తించారు  మరి ముఖ్యంగా హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లను ఎందుకు తీసుకున్నారు అంటూ ప్రశ్నించారు. బలమైన బౌలింగ్ విభాగం లేకుండానే టీమిండియా ఈసారి వరల్డ్ కప్ లో బరిలోకి దిగుతుంది అంటూ కామెంట్స్ చేశారు.

 ఇలా వరల్డ్ కప్ జట్టు ఎంపికపై వస్తున్న విమర్శలపై బీసీసీఐ సెక్రెటరీ జై షా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే వరల్డ్ కప్ జట్టు ఎంపికపై గతంలోను విమర్శలు వచ్చాయి అంటూ చెప్పుకొచ్చాడు జై షా. ఈసారి సెలక్షన్ కమిటీ సమతూకమైన జట్టును ప్రకటించిందని.. కేవలం ఐపీఎల్ ఫామ్ ని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకుండా విదేశాల్లో ఆటగాళ్ల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాం అంటూ చెప్పుకొచ్చారు. అనుభవజ్ఞులతో పాటు యువ ఆటగాళ్లను కూడా ఎంపిక చేసినట్లు తెలిపాడు. అయితే కార్యదర్శిగా తన పాత్ర కేవలం సమాచారం చేరవేయడమే.. జట్టులోకి ఎవరిని తీసుకోవాలనేది  సెలక్షన్ కమిటీ నిర్ణయం మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు జై షా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: