సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న యాంకర్ సుమ వీడియో..!

KSK
తెలుగు టెలివిజన్ రంగంలో ముఖ్యంగా ఈ టీవీ లో చాలా పేరుగాంచిన షోలకు యాంకర్ గా రాణిస్తూ మరోపక్క టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఆడియో ఫంక్షన్ లకు మరియు ప్రమోషన్ ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ టాప్ యాంకర్ గా సక్సెస్ ఫుల్ ఉమెన్ గా రాణిస్తున్న యాంకర్ సుమ వీడియో ఒకటి ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఏదైనా షో కి యాంకరింగ్ సుమ చేస్తుందంటే అది కచ్చితంగా క్లిక్ కావటం ఖాయమనే నమ్మకం దర్శకనిర్మాతల్లో కలిగింది. అంతగా తన యాంకరింగ్ తో మెప్పిస్తోంది. టీవీషోలు, ఆడియో ఫంక్షన్స్ అంటూ బిజీగా గడిపే సుమ ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తమ అభిమానుల కోసం వెరైటీ వీడియోలు చేస్తుంది.


'సుమక్క' అనే పేరుతో ఛానెల్ మొదలుపెట్టింది. చానల్ ప్రారంభమైందో లేదో అతి తక్కువ సమయంలోనే దాదాపు రెండున్నర లక్షల మంది  సబ్‌స్క్రైబ్ చేసుకున్నారు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందంటే సుమ స్వయంగా సాంబార్ ప్రిపేర్ చేస్తుంది. సుమ ఆరోగ్య రహస్యం సాంబారేనట.


ఈ సందర్భంగా ఆమె రుచికరమైన సాంబార్ ఎలా తయారు చేయాలో వంట రూపంలో వీడియోలు తన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేసింది. ఈ క్రమంలో తానే స్వయంగా మార్కెట్ కు వెళ్లి సాంబార్ కి కావలసిన కూరగాయలు...రంగోలి చేయడం తర్వాత ఇంటికి వెళ్లి తన కిచెన్ రూమ్ లో తన ఫేవరెట్ సాంబార్ ఎలా తయారు చేయాలో అనే విషయాలు చెబుతూ వీడియో చేసి తన యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడంతో యాంకర్ సుమ అక్క వీడియో వైరల్ గా మారింది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: