ఈ సంక్రాంతికి బాలయ్య సినిమా లేనట్టే..?

KSK
టాలీవుడ్ ఇండస్ట్రీలో సంక్రాంతి హీరో అంటే టక్కున గుర్తొచ్చేది నందమూరి బాలకృష్ణ . బాలయ్య బాబు ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది అంటే ఖచ్చితంగా అది ప్రభంజనం సృష్టిస్తుందని డిసైడ్ అయిపోతారు. అదే క్రమంలో ఇండస్ట్రీలో సంక్రాంతి సీజన్ ఎక్కువగా కలిసొచ్చిన హీరోగా కూడా బాలయ్య కి మంచి సెంటిమెంట్ ఉంది. దీంతో ప్రతి సంక్రాంతిని టార్గెట్ చేసుకుని నందమూరి బాలయ్య బాబు ఏదో ఒక సినిమా ప్లాన్ చేసుకునే షూటింగ్ మొదలెడతారు. ఇప్పుడు అదే విధంగా రాబోయే సంక్రాంతిని టార్గెట్ చేసుకుని కె.ఎస్.రవికుమార్ దర్శకత్వం లో సినిమా ఒప్పుకునే ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న బాలయ్య బాబు వచ్చే సంక్రాంతికి సినిమా విడుదల అవటం కష్టమనే భావనలో ఉన్నట్లు ఫిలిం నగర్ లో వినబడుతున్న టాక్.


అయితే సంక్రాంతి కి విడుదల చేద్దామని ముందు భావించిన కొన్ని అనివార్య కారణాలవల్ల సంక్రాంతి తర్వాత గాని లేకపోతే సంక్రాంతి ముందే క్రిస్మస్ సెలవల్లో గాని బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా సంక్రాంతికి అల్లు అర్జున్ మరియు మహేష్ బాబు ల సినిమాలు రిలీజ్ అవుతున్న క్రమంలో ఆ సినిమాల బిజినెస్ పోకూడదని బాలకృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారని మరోపక్క ఫిలింనగర్ లో వినపడుతున్న టాక్.


దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో రావటంతో బాలయ్య బాబు అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారు. మరోప్రక్క బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సినిమా అయిపోయిన వెంటనే బోయపాటి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట. అంతేకాకుండా బోయపాటి సినిమా కోసం బరువు తగ్గడానికి జిమ్ లో ఎక్సర్సైజులు కూడా చేస్తూ బిజీబిజీగా ఒకపక్క షూటింగ్ చేస్తే మరోపక్క బాడీ తగ్గించే పనిలో ఉన్నారట బాలయ్య బాబు. మొత్తం మీద వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ సినిమా లేనట్టే అని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: