విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురుచూస్తున్న బిగిల్ ట్రైలర్ ఈ రోజు సాయంత్రం 6గంటలకు విడుదలకానుంది. రెండున్నర నిమిషాల నిడివి తో ప్రేక్షకులముందుకు రానున్న ఈ ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ఇవ్వనుందని సమాచారం. ఈ ట్రైలర్ ను తమిళనాడు లోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు. కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇంతకుముందు అట్లీ -విజయ్ కాంబినేషన్ లో వచ్చిన తెరి, మెర్సల్ బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించడంతో బిగిల్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం తెలుగులో విజిల్ అనే టైటిల్ తో విడుదలకానుంది. గత ఏడాది విజయ్ సర్కార్ తెలుగులో విడుదలై సూపర్ హిట్ కావడంతో విజిల్ పై కూడా తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు వున్నాయి. ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను మహేష్ ఎస్ సొంతం చేసుకోగా విజయ్ కెరీర్ లోనే ఈచిత్రం ఏపీ&తెలంగాణలో ఏకంగా 400స్క్రీన్ లలో విడుదలకానుంది. అయితే తెలుగు వెర్షన్ ట్రైలర్ ఎప్పుడు విడుదలవుతుందో క్లారిటీ రావాల్సి వుంది.
భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం లో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రం దీపావళికి కానుకగా తమిళం తోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలకానుంది. తెలుగులో దీపావళికి పెద్ద సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా విజిల్ కు కలిసి రానుంది. మరి ఈచిత్రంతో హిట్ కొట్టి విజయ్ తెలుగు లో కూడా సాలిడ్ మార్కెట్ ను ఏర్పరుచుకుంటాడో లేదో చూడాలి.