అంతా బాగుంది కానీ అసలు చోట 'సైరా' కి భారీ దెబ్బ పడింది..?

KSK
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో దూసుకుపోతుంది. చాలా కాలం తర్వాత చిరంజీవికి ఇంద్ర సినిమా తరహాలో బ్లాక్ బస్టర్ పడటంతో సైరా సినిమా కి బ్రహ్మరథం పడుతున్నారు తెలుగు సినిమా ప్రేక్షకులు. తెలుగు భాషతో పాటు సౌత్ లో చాలా చోట్ల విడుదలైనా సైరా కి మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం సైరా సినిమా యూనిట్ మొత్తం సక్సెస్ సంబరాలు చేసుకుంటుంది. అయితే సైరా సినిమా విడుదలైన చాలాచోట్ల అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సరైన టాక్ దక్కించుకోలేకపోయింది.


సినిమాలో అమితాబ్ బచ్చన్ ఉన్నాగాని సైరా సినిమా అంతగా బాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దానికి నిదర్శనం అక్కడ వస్తున్న కలెక్షన్లు. ఇటీవల తెలుగు ఇండస్ట్రీకి చెందిన సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ లో రికార్డులు సృష్టిస్తూ బాలీవుడ్ లో ఉన్న ప్రముఖులకు దిమ్మతిరిగి పోయే విధంగా మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సింహాసనంపై కూర్చుని ఇండస్ట్రీని ఏలిన చిరంజీవి సినిమా... బాలీవుడ్ లో విడుదల భారీ స్థాయిలో ఉండటంతో... విడుదల కాక ముందు బాలీవుడ్ లో ఉన్న చాలా మంది ప్రముఖులు బాలీవుడ్ మీడియా కూడా కచ్చితంగా సైరా సినిమా మరో బాహుబలి అవుతుందని అనుకున్నారు.


కానీ బాలీవుడ్ లో 'సైరా' సినిమా డిజాస్టర్ గా నిలిచినట్లు కలెక్షన్ల లెక్కలు చెబుతున్నాయి. 'సైరా' హిందీ వెర్షన్ తొలిరోజు రూ.2.5 కోట్లు నెట్ వసూళ్లు రాబట్టింది. ఇదే క్రమంలో 'వార్' సినిమా పోటీకి ఉండడంతో అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదని అనుకున్నారు. అయితే రెండో రోజు 'సైరా' వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నెట్ వసూళ్లు కోటి రూపాయలకు అటు ఇటుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఇన్ని రోజులు గడిచిన గాని...సైరా సినిమా కలెక్షన్ల విషయంలో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: