సైరాకు 4 స్టార్స్.. ఔట్ స్టాండింగ్ అనేసిన బాలీవుడ్ మీడియా..!

shami
మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేదర్ రెడ్డి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. భరీ బడ్జెట్ తో అంతకుమించిన భారీ అంచనాలతో రిలీజ్ అవుతున్న సైరా సినిమాపై బాలీవుడ్ మీడియా వర్గాల నుండి పాజిటివ్ టాక్ వచ్చింది.


ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీస్ కు, మీడియా ప్రతినిధులకు స్పెషల్ షో వేయడం జరిగిందట. సినిమా చూసిన బీ టౌన్ మీడియా పీపుల్ సినిమా ఔట్ స్టాండింగ్ అనేస్తున్నారు. మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో తెలుగు రెండు రాష్ట్రాల్లో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాదు కొన్ని బాలీవుడ్ వెబ్ పోర్టల్స్ అప్పుడే సైరాకు 4 స్టార్ రేటింగ్ ఇచ్చేశారు.


మెగాస్టార్ చిరంజీవి నటన మాత్రం అదిరిపోయిందని స్పెషల్ గా చెబుతున్నారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ కూడా సూపర్ అనేస్తున్నారు. మొదటి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కింది. పదేళ్ల క్రితమే ఈ సినిమా చేయాలని అనుకున్నా చిరంజీవి కలను ఇన్నాళ్లకు నిజం చేశాడు రాం చరణ్. ఈ సినిమాలో నటించిన మిగతా నటీనటులు కూడా అదరగొట్టేశారట.  


వి.ఎఫ్.ఎక్స్, యాక్షన్ సీన్స్, డైలాగ్స్ అన్ని ఒకదానికి మించి మరోటి ఉన్నాయట. బాహుబలి తర్వాత ఆర్ రేంజ్ బడ్జెట్ తో వచ్చిన సైరా సినిమాపై అన్ని భాషల్లో భారీ అంచనాలున్నాయి. సినిమాలో బిగ్ బీ అమితాబ్ నటించడం వల్ల బాలీవుడ్ ఆడియెన్స్ కు ఈ సినిమా ఇంకాస్త క్రేజీగా మారింది. మరికొద్ది గంటల్లో ఆడియెన్స్ ముందుకు వస్తున్న సైరా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.  టాక్ బాగుంటే మాత్రం మెగా ఫ్యాన్స్ హంగామా వేరేలా ఉంటుంది. ఇక కలక్షన్స్ దుమ్ముదులిపేయడం ఖాయం. 
 


#SyeRaaNarasimhaReddy #OneWordReview

"O-U-T-S-T-A-N-D-I-N-G"

It is a Complete Patriotic Family Entertaintainer with Terrific performance by #MegastarChiranjeevi.
& great Direction by #SurrenderReddy

It will prove to be sure shot success at the Box Office.

⭐⭐⭐⭐/5.

— shiva Satyam (@AsliShiva) October 1, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: