సంచలనం రేపుతున్న ‘సైరా’ ఫస్ట్ రివ్యూ?

siri Madhukar
ఈ మద్య సినిమాలు థియేటర్లో రిలీజ్ కన్నా ముందు ఎన్నో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టాప్ హీరోల సినిమాల విషయంలో ఈ హడావుడి మరీ ఎక్కువగా ఉంటుంది. ఈ మద్య సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ‘సాహెూ’ ఓ రేంజ్ లో హంగామా సృష్టించారు..కానీ థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఘోర ఫలితాన్ని పొందింది.  ఇలాంటి సందర్భాలు గతంలో తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలో కూడా జరిగింది. అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ విషయంలో జరిగింది..సినిమా రిలీజ్ కన్నా ముందు బీభత్సం సృష్టిచడం..భారీ అంచనాలు వేయడం..తీరా థియేటర్లో రిజల్ట్ తలకిందులు కామన్ అయ్యింది. 

ఇక రిలీజ్ కు ముందే సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న చిరంజీవి సైరా సూప‌ర్ అంటూ యూఏఈ సెన్సార్ బోర్డ్ మెంబ‌ర్ ఉమైర్ సంధు త‌న రివ్యూ ఇచ్చేయ‌టంతో మూవీపై అంచ‌నాలు పెరిగాయి. దుబైలో ఉంటున్న ఉమైర్ సంధు  పలు సినిమాలపై ముందుగానే తనదైన మార్క్ లో రివ్యూ ఇవ్వడం చూస్తూనే ఉన్నాయం. తాజాగా ‘సైరా’ పై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు.  యుఏఈలో సినిమా సెన్సార్ ప‌నులు పూర్తిచేసు కుంద‌ని.. సినిమా అద్భుతంగా ఉంద‌ని చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టు కొట్ట‌బోతున్నార‌ని సెన్సార్ ఇప్ప‌టికే లీకులిచ్చింది. థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు కుర్చిల్లో ఉత్కంఠంగా కూర్చోవడం..ప్రతి సీన్ కి చప్పట్లు కొట్టడం ఖాయం అంటున్నాడు.

సైరా చూసి త‌ర్వాత మాట‌లు రాలేద‌ని, సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అని త‌న ట్విట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించారు. జాతీయ అవార్డు చిరంజీకి కోసం ఎదురుచూస్తుందని వ్యాఖ్యానించ‌డం విశేషం.  అంతే కాదు దర్శకుడిగా సురేందర్ రెడ్డి చాలా ఉన్నత స్థానానికి చేరుకున్నారని..మెగాస్టార్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతారని కితాబు ఇచ్చారు.  ప్ర‌స్తుతం ఈ ట్వీట్లు సోష‌ల్ మీడియాలో జోరుగా వైల‌ర్ అవుతున్నాయి.  కాకపోతే గ‌తంలో కొన్ని సినిమాల విష‌యంలో ఉమైర్ పాజిటివ్ గా ఇచ్చిన రివ్యూలు బెడిసికొట్టిన విషయాలు తెలిసిందే. ఏది ఏమైనా ‘సైరా’ సంగ‌తేంటో తెలియాలంటే రిలీజ్ వ‌ర‌కూ ఆగాల్సిందే.
#SyeRaaNarasimhaReddy will give you Goosebumps & Emtions Ride !! What a Marvellous Cinematic Experience. #Baahubali Series was a fiction but its made on true events !! #SyeRaa will SMASH All Historic Records in AP & #Chiranjeevi Fans will go gaga over him. ⚡⚡⚡⚡ pic.twitter.com/n5dS6g5vVD

— Umair Sandhu (@UmairFilms) September 27, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: