కియారా బాలీవుడ్ లో ఫగ్లీ సినిమాతో ఎంట్రీ ఇచ్చి బెస్ట్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్. తెలుగులో భరత్ అనే నేను సినిమా మంచి హిట్ ఇచ్చింది. వెంటనే రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాశం వచ్చింది. ఈ సినిమాబంపర్ హిట్ అవుతుంది అనుకుంటే భారీ ప్లాప్ అయ్యింది. అదే సమయంలో బాలీవుడ్ నుంచి కియారాకు అఫర్ రావడం.. కియారా బాలీవుడ్ లో కబీర్ సింగ్ చేయడం జరిగిపోయాయి. ఈ సినిమా సూపర్ హిట్.
ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కబీర్ సింగ్ సినిమా నిలిచింది. దీంతో ఈ అమ్మడికి అవకాశాలు దూసుకుంటూ వస్తున్నాయి. కరణ్ జోహార్ నిర్మాణంలో రెండు సినిమాలకు సైన్ చేసింది. దీంతో పాటు మరికొన్ని సినిమాలు చేసేందుకు కూడా రెడీ అయ్యింది. అటు సౌత్ లో తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నది కియారా. సినిమాలు చేస్తూనే ఫోటో షూట్ లతో అదరగోడుతున్నది.
ఇటీవలే కియారా ఓ ఫోటో షూట్ చేసింది. మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ చేసిన కియారా వావ్ అనిపించే విధంగా దిగింది. అందులో మాములుగా లేదు. అవుట్ అండ్ అవుట్ బ్లాక్ డ్రెస్ తో అదరగొట్టింది. బ్లాక్ డ్రెస్ ఎప్పుడైనా ఎవరికైనా సూపర్ గా ఉంటుంది. అలాంటి బ్లాక్ డ్రెస్ లో కియారా అదరగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
అంతేకాదు, ఇక ఆ ఫొటోకు కియారా ఇచ్చిన మెసేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే. దూసుకొస్తున్న ఫోటో సునామి అని క్యాప్షన్ ఇచ్చింది. సముద్రం బ్యాక్ గ్రౌండ్ లో పడవపై పడుకొని ఇచ్చిన ఫోజులు చూస్తుంటే.. కుర్రకారుకు హుషారు వచ్చేలా ఉన్నది. హుషారుగా షికారు చేస్తున్నట్టుగా ఉన్నది ఆ ఫోటో. వేలాది మంది ఈ ఫోటోను లైక్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లైక్ కొట్టండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి.