పీవీ సింధు బయోపిక్ లో సమంత?
ఇటీవలే ఓ బేబీ మరియు 96 సినిమాల రీమేక్ ను సమంత చేసి ఘనవిజయం సాధించింది. ఆతరువాత బయోపిక్ లో పాట పట్టినట్టుగా కనిపిస్తోంది. పి.వి.సింధు మన రాష్ట్రానికి చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ దేశవ్యాప్తంగా నే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అవార్డులు సాధిస్తూ సాధించడమే కాకుండా ఇప్పుడు బ్యాట్మెంటన్ ఛాంపియన్షిప్ కూడా అందుకుంది.
పీవీ సింధు బయో పిక్ తీయాలని బాలీవుడ్లో కూడా చాలామంది ప్రయత్నిస్తున్నట్లుగా వినికిడి. ఈలోపే సమంత టాలీవుడ్లో ఈ సినిమాను తెరకెక్కించాలని విశేషం ఇందులో ఆమె నటించే పైగా ప్రొడక్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని వినిపిస్తోంది. ఈ సినిమాకి రిలీజ్ డేట్ ఇది అని తెలిస్తే ఆ తర్వాత ఏ నాటికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అన్న దాన్ని బట్టి బాలీవుడ్లో ఈ బయోపిక్ డేట్స్ మార్చుకునే అవకాశాలు ఉన్నాయి.
మొదట ఈ సినిమాకి ఏదైనా బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుందామని అనుకున్నారట కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని సమంత వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కనుక సమంతా చేస్తున్నట్టు కచ్చితంగా వెల్లడి అయితే ఆ తర్వాత సమంత దీని మీద ఎంతో దృష్టిసారించి కష్ట పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఆసక్తిగా చూడాలి అనుకునే అంశం పీవీ సింధు దేశానికే గర్వం కావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి.