చిరంజీవి పై సంచలన ట్వీట్ పెట్టిన పవన్ కళ్యాణ్..!
ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా మూలాలు మరచిపోని వ్యక్తి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశాడు. ఆయన జీవితం ఒక సందేశం అని అటువంటి ఆదర్శవంతమైన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని చాలా మంది యువత పైకి వచ్చారని వారిలో నేను కూడా ఒకరిని అంటూ అటువంటి అన్నయ్యకు నేను తమ్ముడిని కావటం దేవుడిచ్చిన వరం అని పవన్ కళ్యాణ్ తెలిపారు. చిరంజీవి నటనలో ఓనమాలు దిద్దిన తొలి రోజుల నుంచి ఇప్పటివరకు అదే క్రమశిక్షణతో కష్టపడుతున్నారని పవన్ తెలిపారు.
ఎన్నో ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు కష్టాలు కుట్రలు ఇంకా చాలా సమస్యలు ఎదుర్కొని చిరంజీవి గారు ఈ స్థాయికి వచ్చారు అని పవన్ పేర్కొన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రను సైరా చిత్రంగా అందరికి అందిస్తున్న నేపథ్యంలో జన్మదినం సందర్భంగా నా తరఫున నా పార్టీ తరఫున చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పవన్ ట్వీట్ చేశారు. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిరంజీవి అభిమానులు చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని ఎక్కడికక్కడ సేవా కార్యక్రమాలు చేయడానికి ఇప్పటికే రెడీ అయ్యారు.