ఈ సారి ఇస్మార్ట్ శంకర్ లా కాదు - నాభా నటేష్
ఎందుకంటే ఈసినిమాలో నాభా పెద్దగా చేసింది ఏం లేదు. గ్లామర్ తో మాత్రమే ఆకట్టుకుంది. అయితే నాభా ప్రస్తుతం మాస్ రాజా రవితేజ సరసన 'డిస్కో రాజా' లో నటిస్తుంది. ఈ సినిమా లో ఆమె క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా వుంటుందట. దాంతో కేవలం గ్లామర్ పరంగానే కాదు ఈ సినిమాతో మరోసారి మంచి నటిగా నిరూపించుకుంటానని తాజాగా జరిగిన ఇంటర్వ్యూ లో నాభా పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ ఢిల్లీ లో జరుగుతుంది.
ఇటీవలే నాభా ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాబా నటేష్ తోపాటు పాయల్ రాజ్ పుత్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఫై రవి తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం నాభా నటేష్ చేతిలో ఈ ఒక్క సినిమా మాత్రమే వుంది. ప్రస్తుతం ఆమె మంచిఆఫర్ల కొరకు ఎదురుచూస్తుంది.