ప్రభాస్ పెళ్లి కన్ఫామ్..?
ఇటువంటి నేపథ్యంలో తాజాగా 2019 లో నే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని ఇటీవల కృష్ణంరాజు మాట్లాడినట్లు మీడియాలో సోషల్ మీడియాలో తెగ వార్తలు వినబడుతున్నాయి. దీంతో ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో ‘సాహో’ సినిమా త్వరలో విడుదల కాబోతున్న క్రమంలో సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్రభాస్ పెళ్లి చేసుకునే అవకాశం ఉందని...ఇప్పటికే ప్రభాస్ కుటుంబ సభ్యులు అమెరికాకు చెందిన బడా వ్యాపారవేత్త కుమార్తె నీ ప్రభాస్ కి ఇచ్చి పెళ్లి చేసే ఆలోచనలో ఉన్నట్లు వారితో ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా ప్రభాస్ సోదరి కూడా ఇటీవల ప్రభాస్ పెళ్లి కోసం మేము కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నానని తెలపడంతో వచ్చిన వార్తల్లో వాస్తవం గట్టిగానే ఉన్నట్లు అర్థమవుతుంది. ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’ సినిమా రిలీజ్ గురించి ఎంతగానో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాడు. గతంలోనే ఈ సినిమా ఆగస్టు 15న వస్తుందని అభిమానులను ఊరించి తర్వాత ఈ నెల చివరిలో విడుదల చేస్తామని సినిమా యూనిట్ చెప్పడంతో నిరుత్సాహానికి గురయ్యారు అభిమానులు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా సినిమా విడుదల అవటం కన్ఫామ్ అని అభిమానులకు అంచనాలకు తగిన విధంగానే సినిమా ఉంటుందని అంటున్నారు సినిమా యూనిట్ కి చెందినవారు. అయితే మొత్తం మీద చూసుకుంటే ప్రస్తుత పరిణామాలను బట్టి సాహో సినిమా తర్వాత ప్రభాస్ పెళ్లి కన్ఫర్మ్ అన్నట్లుగానే ఉంది.