జెర్సీ ఎఫెక్ట్ ఏమాత్రం గ్యాంగ్ లీడర్ మీద పడలేదా..?

Kunchala Govind
నానీ జెర్సీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు. పెద్ద కమర్షియల్ సక్సస్ అవుతుందనుకున్నాడు. అయితే ఈ సినిమా అనుకున్నంతగా కమర్షియల్ సక్సస్ అవలేదు. కానీ నిర్మాతలు మాత్రం సేఫ్ గానే ఉన్నారు. అంతేకాదు ఈ సినిమాను బాలీవుడ్ లోనూ నిర్మించబోతున్నారని సమాచారం. నానీ, శర్వానంద్, రామ్, నాగచైతన్య..వీళ్ళందరివి మీడియం బడ్జెట్‌ తో తెరకెక్కించే సినిమాలు. ప్రస్తుతం ఈ తరహా సినిమాలే బాగా ఆడుతున్నాయి. మీడియం బడ్జెట్‌ సినిమాలదే హవాగా మారిన ట్రెండ్‌లో నెక్స్‌ట్‌ రాబోతోన్న నాని సినిమా 'గ్యాంగ్‌లీడర్‌'కి డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ఈ సినిమా టీజర్‌ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈసినిమాపై నమ్మకం కూడా డబుల్‌ అయింది. 

భారీ సినిమాలు కొనడానికి వీల్లేనంత భారీ మొత్తాలు డిమాండ్‌ చేస్తుండడంతో వాటిపై మొత్తం ఒకేసారి రిస్క్‌ చేయడం కంటే రిస్క్‌ తక్కువ రిటర్న్స్‌ ఎక్కువ అయిన మీడియం బడ్జెట్‌ సినిమాలకి గిరాకీ బాగా పెరిగింది. అంతేకాదు శాటిలైట్ రైట్స్, అమోజాన్ లాంటి బిజినెస్ కూడా బాగా వస్తుంది. ఇక త్వరలో రాబోయే ఈ రేంజ్‌ సినిమాలలో 'గ్యాంగ్‌లీడర్‌' బాగా కలెక్షన్లు తెచ్చేలా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమాకి రెగ్యులర్‌ బయ్యర్ల నుంచే కాకుండా లోకల్‌గా ఏరియాల వారీ బయ్యర్ల నుంచి కూడా పోటీ గట్టిగా ఉంది. 

అంతేకాదు ఆగస్ట్‌ 30న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతానికి సెప్టెంబర్‌ రెండవ వారానికి వాయిదా పడటం కూడా సినిమా బిజినెస్ పరంగా బాగా కలిసి వచ్చింది..
ఇక మెగాస్టార్ చిరంజీవి 'సైరా' గనక రిలీజ్‌ వాయిదా పడితే దసరా వీకెండ్‌లో రిలీజ్‌ చేయాలని కూడా చిత్ర బృందం అనుకుంటున్నారట. జెర్సీతో ప్రేక్షకుల మన్ననలు, విమర్శకుల ప్రశంసలు అందుకున్న నాని మళ్లీ ఈ సినిమాతో ఈసారి మంచి కమర్షియల్‌ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మరి జెర్సీ ఎఫెక్ట్ లేకుండా నానీ గ్యాంగ్ లీడర్ తో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. ఇక రీసెంట్‌గా రిలీజైన మాస్ ఎంటర్‌టైనర్ ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్లు చూసి కూడా మన యంగ్ హీరోలు తమ సినిమాలు కూడా ఈ రేంజ్ లో కమర్షియల్ హిట్ పడాలని ఆశపడుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: