ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో మూవీ షూటింగ్ పూర్తయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ లాక్ చేశారని సమాచారం. సెకండ్ హాఫ్ షెడ్యూల్ జరుగుతున్నది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బోలెడు ఉన్నాయి. ఈ సన్నివేశాలను భారీ ఖర్చుతో తెరకెక్కించారు.
కేవలం యాక్షన్ సన్నివేశాల కోసమే ఏకంగా రూ. 90 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారట. ఇదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తున్నది. ఇక్కడ మరో విషయం కూడా బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ కోసం ఓ కారును వినియోగించారు. అది యాక్షన్ సీన్స్ సమయంలో వస్తుంది.
ఈ కారును రూ. 5 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. సినిమాలో ఈ కారు హైలైట్ అవుతుంది. సినిమా ప్రచారంలో భాగంగా ఈ కారును ఫ్యాన్స్ కు పరిచయం చేయబోతున్నారట. ఆడియో, ప్రీ రిలీజ్ వేడుకల్లో ఈ కారును వినియోగించాలని అనుకంటున్నట్టు సమాచారం.
ప్రభాస్ కు జోడిగా ఇందులో శ్రద్ధా కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి మ్యూజిక్ దర్శకులు చాలా మంది ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను జిబ్రాన్ అందిస్తున్నారు. యువీ క్రియేషన్స్ సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది.