బాలయ్య అందుకే సీరియస్ అవుతారట!
ఈ విషయంపై తాజాగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ ఎందుకు బయట మనుషులను కొడతాడో ఎక్సప్లేయిన్ చేశారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ...బాలయ్య బాబు అందరిని కొట్టేస్తాడు అని అంటుంటారు. ఈ విషయం గురించి నేను వివరణ ఇవ్వాలి. పబ్లిక్ లోకి హీరోయిన్లు వెళ్ళినప్పుడు మీద పడిపోయే ఆకతాయిలు ఉంటారు. హీరోయిన్లకు మాత్రమే కాదు.. హీరోలకు కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుంది.
ఎవడు ఏ వైపు నుంచి వచ్చి మీదపడిపోతాడో తెలియదు. అందుకే ప్రమాదకరంగా తన మీదకు వచ్చే వాళ్ళని బాలయ్య కొడుతుంటారు. మిగిలిన హీరోలు ఈ పని చేయరు కాబట్టి బాలయ్య మాత్రమే అందరికి కోపిష్టిలా కనిపిస్తున్నారు. వాస్తవానికి ఆయన చాలా మంచి వ్యక్తి అని పూరి బాలయ్యని సమర్థించారు. ‘ఇస్మార్ట్ శంకర్’ సూపర్ డూపర్ హిట్ అవడంతో మంచి జోష్ మీద ఉన్నారు పూరి జగన్నాథ్. ఆ సినిమా సక్సెస్ ఇంటర్వ్యూ లో భాగంగా పూరి ఈ విషయాలను తెలియజేశారు.