ఆగస్టు 2న గుణ 369
దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ .. నాకు కార్తికేయ నటన బాగా నచ్చింది. ఆర్ ఎక్స్ 100 హీరోగానే పిలుస్తాను. నటన పరంగా చాలా ఈజ్ ఉన్న హీరో కార్తికేయ. అర్జున్ జంధ్యాల నా దగ్గర భద్ర సినిమా నుండి పనిచేస్తున్నాడు. ఏదైనా పని చెబితే దాన్ని చేసే వరకు అక్కడినుండి కదలడు చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. గుణ సినిమా గురించి నాకు తెలుసు. తప్పకుండా ఈ సినిమాతో అటు కార్తికేయకు ఇటు అర్జున్ కు మంచి పేరొస్తుంది అన్నారు.
హీరో కార్తికేయ మాట్లాడుతూ .. ఈ సినిమాలో నేను హీరోగా నటించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో హీరో అనేకంటే మన పక్కింటి అబ్బయ్యి అన్న తరహాలో పాత్రలు ఉంటాయి. అలాగే హీరోయిన్ పాత్ర కూడా అలాగే ఉంటుంది. నిజజీవితాలకు దగ్గరగా ఉన్న కథ. ఇందులో నేను బాగా నటించానని మా టీమ్ అంటున్నారు. నాకు సినిమా ఇష్టం. దానికోసం ఏదైనా చేస్తా. ఈ సినిమాతో నాకు మంచి హిట్ ఇస్తారని ఆశిస్తున్నాను అన్నారు.
నిర్మాతలు మాట్లాడుతూ .. షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగతా కార్యక్రమాలు పూర్తీ చేసి ఆగస్టు 2న విడుదల చేస్తామని అన్నారు.