ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ పూర్తయింది అనుకున్నారు. కానీ, ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉన్నది. మొన్నటి వరకు ఆస్ట్రేలియాలో షూటింగ్ జరిగితే, ప్రస్తుతం ఆస్ట్రియాలో షూట్ జరుపుకుంటోంది. ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.
ఆగష్టు 15 వ తేదీ అంటే పట్టుమని రెండు నెలలు కూడా లేదు. ఇప్పటి వరకు ప్రమోషన్స్ వంటివి స్టార్ట్ చేయలేదు. ఇప్పటి వరకే స్టార్ట్ చేయకపోతే .. మరి ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రియాలో షూటింగ్ జరుపుకుంటున్నట్టు ప్రభాస్ సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ అయ్యింది .
ఈ ఫోటోను శ్రద్ధా కపూర్ హెయిర్ స్టైలిస్ట్ ఫోటోను షేర్ చేసింది. ప్రభాస్, శ్రద్దా కపూర్ మిగతా కొంతమంది కృ మెంబర్ కేబుల్ కారులో ఎంజాయ్ చేస్తున్నారు. సెల్ఫీలు దిగుతూ హ్యాపీగా షూట్ చేస్తున్నారు. ఆస్ట్రియా షెడ్యూల్ పూర్తయితే సినిమాకు గుమ్మడికాయ కొట్టెయ్యచ్చు.
ఇప్పటికే ఈ మూవీ దాదాపుగా 255 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకుంది. బాహుబలి రికార్డులను బద్దకు కొట్టడం ఖాయమనే అంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ విషయంలో ప్రభాస్ సాహో బాహుబలి ని బీట్ చేసింది.