జులై 12న 'ఇస్మార్ట్ శంకర్' గ్రాండ్ రిలీజ్.

Kunchala Govind
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటిస్తున్న 'ఇస్మార్ట్ శంకర్' ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న సంగతి తెలిసిందే.   దీంతో ప్రమోషన్స్ మొదలు పెట్టారు.  రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కన్‌ఫర్మ్ చేశారు. 'ఇస్మార్ట్ శంకర్' ను జులై 12 వ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ఫిలిం మేకర్స్ పూరీ, ఛార్మీ అధికారికంగా ప్రకటించారు.  


అటు పూరీ డైరెక్ట్ చేసిన సినిమాలు, ఇటు రామ్ నటించిన సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలాయి. అందుకే ఈ ఇద్దరికి ఇప్పుడూ ఓ భారీ హిట్ కావాలి. అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నిధీ అగర్వాల్ కి కూడా ముందు రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. కాబట్టి వీళ్ళతో పాటు నిధీకి మాంచి కిక్కిచ్చే హిట్ కావాలి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మూడు పాటల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. ఈ పాటల చిత్రీకరణ పూర్తి కాగానే ప్రమోషన్స్ లో జోరు పెంచుతారట.


ఈ సినిమాలో రామ్ సరసన నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. పూరి జగన్నాధ్.. ఛార్మీ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  పూరి రూపొందించిన సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర వరసగా నిరాశపరుస్తున్నాయి. మరి ఈ డబల్ దిమాక్ హైదరాబాది రామ్ క్యారెక్టర్ తో ఈసారి హిట్ సాధిస్తాడా అనేది వేచి చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: