మహేష్ కన్నా ఎక్కువ టెన్షన్ పడుతున్న అల్లరి నరేష్..?
గత కొంత కాలం నుండి చేస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అయిన నేపథ్యంలో చేతిలో కూడా ఎక్కువ సినిమాలు లేని టైం లో వంశీ పైడిపల్లి చెప్పిన స్టోరీ కి ఎంప్రెస్ అయినా అల్లరి నరేష్..సినిమాలో మహేష్ బాబు కి ఫ్రెండ్ గా నటించి కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇండస్ట్రీలో ఒక కమెడియన్ హీరోగా ఉన్న అల్లరి నరేష్ ఒక స్టార్ హీరో పక్కన క్యారెక్టర్ రోల్స్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదని ఏ మాత్రం సినిమా అడ్డం తిరిగిన అల్లరి నరేష్ కెరీర్ డేంజర్ జోన్ లో పడినట్లే అని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కంటే ఈ సినిమా రిజల్ట్ కోసం అల్లరి నరేష్ తెగ టెన్షన్ పడుతున్నట్లు ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్.