బయటపడ్డ సమంత దివ్యాన్ష్ కౌషిక్ విభేదాలు !

Seetha Sailaja
గత కొద్దిరోజులుగా ‘మజిలీ’ మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్యాన్ష్ కౌషిక్ తో సమంతకు విభేదాలు వచ్చాయి అన్న గాసిప్పులు హడావిడి జరుగుతోంది. దీనికి బలం చేకూరుస్తు మొన్న జరిగిన ‘మజిలీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సమంత దివ్యాన్ష్ తో అంటీముట్టనట్లు ఉండటమే కాకుండా వేదిక పై ఆమె గురించి సమంత ఒక్క మాట కూడ మాట్లాడకపోవడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.

అయితే నాగచైతన్య మాత్రం తన ఉపన్యాసంలో దివ్యాన్ష్ మంచినటి అని ప్రశంసిస్తూ ఆమె పై ప్రశంసలు కురిపించాడు. ఇది ఇలా ఉంటే ‘మజిలీ’ మూవీలో చైతన్య దివ్యాన్ష్ లపై చిత్రీకరించిన డీప్ లిప్ లాక్ సీన్ గురించి ఈమూవీ షూటింగ్ అయ్యేంతవరకు సమంతకు తెలియకపోవడం ఆమెకు షాక్ ఇచ్చినట్లు టాక్. 

ఈ సీన్ ను అతి రహస్యంగా దర్శకుడు శివ నిర్మాణ చిత్రీకరించడం పట్ల సమంతకు కొంత అసహనం కలిగినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయమై ఈమూవీ ప్రమోషన్ విషయంలో ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతను ప్రశ్నిస్తే ఈసీన్ గురించి ఒకొక్క ఇంటర్వ్యూలో ఒకొక్క రకంగా సమంత స్పందిస్తోంది. కొన్ని ఇంటర్వ్యూలలో అటువంటి సీన్ ఉన్నట్లు తనకు తెలియదు అని చెపితే మరికొన్ని ఇంటర్వ్యూలలో కథ ప్రాముఖ్యత రీత్యా అటువంటి సీన్ చిత్రీకరించి ఉంటారు అంటూ సమాధానం ఇచ్చింది. 

సమంతకు ఈ విషయమై కోపం ఎందుకు వచ్చింది అన్న విషయం పై క్లారిటీ లేకపోయినా నిన్న సాయంత్రం సమంత తిరుపతి వెళ్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఏడుకొండలు కాలినడకన ఎక్కి స్వామిని దర్శించుకుంది. అయితే సమంత క్రిస్టియన్ అయిన నేపధ్యంలో ఇలా తిరుపతిలో హడావిడి చేయడంతో ఇది అంతా ‘మజిలీ’ విజయం కోసం మొక్కు అనుకోవాలా లేదంటే చైతన్య కోసం ఆమె మతం మారిందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: