అనుకున్న తేదీకే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్!

siri Madhukar
టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పటి వరకు ఎన్నో సంచలనాత్మక సినిమాలు తీశారు.  అందులో ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ఒకటి.  ఈ సినిమా రిలీజ్ కి ముందే రాజకీయాల్లో ప్రకంపణలు సృష్టింది.  ఈ సినిమాలో ఎన్టీఆర్ 1989 తర్వాత రాజకీయాంగా ఎలాంటి పరిస్థితి ఎదుర్కొన్నాడు..ఆయన జీవితంలోకి లక్ష్మీ పార్వతి వచ్చిన తర్వాత ఏం జరిగింది. ఆయన వెనుక రాజకీయ కుట్రలు ఎవరు చేశారు అన్న విషయాలన్నీ ఇందులో చూపించబోతున్నానని ముందు నుంచి చెబుతున్నాడు. 

అయితే ఈ సినిమాని ఆపేందుకు టీడీపీ శ్రేణులు తెగ కష్టపడుతున్నాయని అన్నారు రాంగోపావ్ వర్మ. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి రెండు ట్రైల‌ర్స్ విడుద‌ల చేసిన వ‌ర్మ ప‌లు వీడియో సాంగ్స్ కూడా రిలీజ్ చేశాడు. వీటితో సినిమాపై చాలా ఎక్స్‌పెక్టేష‌న్స్ పెరిగాయి.  సినిమా విడుద‌ల‌ని ఆపేయాల‌ని ఇటీవ‌ల ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేశారు టీడీపీ శ్రేణులు. ఈ నేప‌థ్యంలో ఈసీ నిర్ణ‌యం ఎలా ఉంటుంద‌నే దానిపై అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది.

కాగా, మార్చి 22న విడుద‌ల కానున్న ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర రిలీజ్‌ని అడ్డుకోలేమ‌ని ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తేల్చి చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సినిమా విడుదలైన తరువాతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని.. నిజంగా ఓటర్లను ప్రభావితం చేసే సన్నివేశాలు ఆ సినిమాలో ఉంటే రిలీజ్ తరువాత చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు ఈసీ.  మొత్తానికి మార్చి 22న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: