బన్నీ పై గెలిచిన త్రివిక్రమ్ !

Seetha Sailaja
త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ మూడవసారి రిపీట్ చేస్తూ త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి కథ విషయమై బన్నీ త్రివిక్రమ్ ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ భేదాభిప్రాయాలు వల్లనే ఈమూవీ ప్రాజెక్ట్ మొదలు కావడం ఆలస్యం అవుతోంది అన్న కామెంట్స్ కూడ ఉన్నాయి. 

అయితే త్రివిక్రమ్ వ్యూహాలకు అల్లు అర్జున్ రాజీ పడిపోతున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈసినిమాకు సంగీత దర్శకుడుగా దేవిశ్రీ ప్రసాద్ ను పెట్టమని అనేకసార్లు బన్నీ త్రివిక్రమ్ పై ఒత్తిడి చేసినా త్రివిక్రమ్ ఆమాటలకు రాజీ పడకుండా తాను ఇష్టపడుతున్న థమన్ ను సంగీత దర్శకుడుగా ఎంపిక చేసే విషయంలో విజయం సాధించాడని టాక్. 

ఇక హీరోయిన్ విషయంలో కూడ అల్లు అర్జున్ మాట చెల్లక త్రివిక్రమ్ ఎంపికకు బన్నీ ఓటు వేయవలసిన పరిస్థితులు ఏర్పడినట్లు సమాచారం. వాస్తవానికి మరొకసారి పూజ హెగ్డే తో తాను నటించే విషయంలో బన్నీకి ఇష్టం లేకపోవడంతో కియారా అద్వానీ వైపు బన్నీ ఆలోచనలు ఉన్నా ఆమె అల్లు అర్జున్ ల కాంబినేషన్ బాగుండదనీ చెప్పి ఒప్పించడంలో త్రివిక్రమ్ తన మాట నెగ్గించుకున్నట్లు తెలుస్తోంది. 

అదేవిధంగా ఈమూవీకి సంబంధించి ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక విషయంలో కూడ బన్నీ మాటలు ఏమీ చెల్లడం లేదనీ చివరకు త్రివిక్రమ్ నిర్ణయాలకు అనుగుణంగా ఈమూవీ నటీనటుల ఎంపిక కొనసాగుతోంది అని టాక్. దీనితో 'అరవింద సమేత అనుకున్న స్థాయిలో విజయం సాధించకపోయినా హీరోలను కంట్రోల్ చేసే విషయంలో త్రివిక్రమ్ తన మాటల మాయను తెలివిగా కొనసాగిస్తున్నాడు అంటూ కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: