ఆసుపత్రిలో చేరిన ప్రముఖ సింగర్!

siri Madhukar
బాలీవుడ్ లో 90వ దశకంలో పాప్ సాంగ్స్ తో అలరించి..తర్వాత సినీ గాయకుడిగా ఎన్నో సినిమాల్లో పాడారు.  బెంగాలీ, కన్నడ, తెలుగు, తమిళం, మరాఠీ, ఒరియా, గుజరాతీ, అస్సామీ, తుళు, మైథిలీ, నేపాలీ లాంటి అనేక భాషల్లో పాడుతూ తన గాత్రంతో అలరించారు.  సింగర్ గానే కాకుండా పలు సినిమాల్లో నటించారు.  భారతీయ గాయకుల్లో అత్యధిక పారితోషికం అందుకునే వారిలో ఒకరు.

తాజాగా  సోనూనిగమ్ తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరారు. బొఖారాలో లైవ్ కాన్సర్ట్ కోసం సోనూ నిగమ్ నేపాల్‌కు వెళ్లాడు. తీవ్రమైన వెన్ను నొప్పి బాధిస్తుండటంతో సోనూ నిగమ్ ఆస్పత్రిలోని వీఐపీ లాంజ్‌లో చేరాడు. సోనూ నిగమ్ ఫుడ్ అలర్జీ కారణంగా ఇటీవలే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం వివిధ ప్రదేశాల్లో సంగీత ప్రదర్శనలు ఇస్తూ వస్తున్నారు. 

ఈ నేపథ్యంలో నేపాల్‌లోని పోఖ్రాలో నిర్వహించే ఒక సంగీత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు.  ఉన్నట్టుండి ఆయనకు వెన్ను నొప్పి రావడంతో   ఖాట్మాడూలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు.  ఎంఆర్‌ఐ పరీక్ష చేశారు. దీనికి సంబంధించిన రిపోర్టు ఆధారంగా ఆయనకు చికిత్స అందించనున్నారు. డాక్టర్ పంకా జలన్, డాక్టర్ ప్రవీణ్‌లు సోనూనిగమ్‌కు వైద్య చికిత్స అందిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: