నన్ను ఆ విధంగా ఫోటోలు తీశారు ... చిన్మయి ఆవేదన ...!

Prathap Kaluva

డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తనకు జరిగిన చేదు అనుభవాలను నిర్మొహమాటంగా బయటికి చెబుతుంది.  ఈ మధ్యనే మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి స్పందించింది. తమిళ ప్రసిద్ధ సినీగేయ రచయిత వైరముత్తు మీద ఆమె ఆరోపణలు చేసింది. ఆయన తనతో అనుచితంగా ప్రవర్తించాడని వివరించింది. అదో పెద్ద దుమారమే రేపింది. తనతో పాటు మరి కొందరు వైరముత్తు బాధితులున్నారని చిన్మయి వ్యాఖ్యానించింది.


ఆ సంగతలా ఉంటే.. తాజాగా ట్విటర్లో ఈమెకు ఫాలోయర్ ఇచ్చిన సూచనపై స్పందించిన తీరు వార్తల్లోకి వచ్చింది. ఒకవైపు చిన్మయిని అభినందిస్తూనే ‘చీర కట్టుకోవచ్చు కదా..’ అని ఒక ఫాలోయర్ ట్వీట్ చేశాడు. దీనిపై స్పందిస్తూ ఆమె వేరే విషయాన్ని చెప్పింది. తను గతంలో ఇలాంటి సూచనల మేరకు చీర కట్టుకున్నట్టుగా పేర్కొన్న చిన్మయి, ఆ సందర్భంలో కొంతమంది తనను సైడ్ నుంచి ఫొటోలు తీశారని..


తన ఎదభాగం కనిపించేలా ఫొటోలు తీసి, వాటిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్ లోడ్ చేశారని, మరి కొందరు వాటిని చూస్తూ masturbating చేసుకున్న వైనాన్ని తనకు మెసేజ్ లు పంపించారని.. చిన్మయి వివరించింది. ఇలా తను ఎదుర్కొన్న చెత్త అనుభవాలను ఆమె ధైర్యంగా నెటిజన్లకు వివరించింది. సోషల్ మీడియాతో మేలే జరుగుతోంది అనుకోవచ్చు కానీ.. అయితే శాడిస్టులకు ఇదొక స్వర్గం అయిపోయిందనే విషయాన్ని ఈ ఉదంతం అర్థమయ్యేలా చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: