దాసరిని తెలంగాణ సర్కారు అవమానించిందా..? మోహన్‌ బాబు ఫైరింగ్...?

Chakravarthi Kalyan

తెలంగాణ ఏర్పడకముందు సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినీపరిశ్రమతో ప్రభుత్వం సంబంధాలు చాలా బాగా ఉన్నాయి. కేటీఆర్‌ కు సినిమా సర్కిల్లో స్నేహితులు ఉండటం.. వివాదాలకు దూరంగా ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందన్న భ్రమలు క్రమంగా తొలగిపోయాయి.



తెలంగాణ సర్కారులో పెద్దలు.. ప్రత్యేకించి కేటీఆర్, తలసాని వంటి వారు పలు సినిమా షూటింగ్ కార్యక్రమాలుకు హాజరుకావడం సాధారణంగా జరుగుతూనే వస్తోంది. కానీ తాజా నటుడు మోహన్ బాబు చేసిన ఓ కామెంట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పాలకొల్లులో దర్శకరత్న దాసరి నారాయణరావు కాంస్య విగ్రహం ఆవిష్కరణ సందర్భంగా మోహన్ బాబు ఈ కామెంట్స్ చేశారు.



దాసరి నారాయణరావు సినీపరిశ్రమకు ఎంతో మేలు చేశారని.. మోహన్ బాబు అన్నారు. దాసరి స్వస్థలంలో పాలకొల్లులో ఆయన కాంస్య విగ్రహం ఆవిష్కరిస్తున్నా.. ఆయన ఎంతో సేవ చేసిన హైదరాబాద్ లో మాత్రం ఆయన విగ్రహానికి కనీసం 5 గజాల స్థలం కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కారు సినీపరిశ్రమకు సహకరించడం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.



మరి దాసరి విగ్రహం కోసం స్థలం కావాలని ప్రభుత్వాన్ని అడిగారా.. అడిగినా స్థలం ఇవ్వలేదా అన్న అంశాలపై క్లారిటీ లేదు. ఐతే... ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. మరి ఈ కామెంట్స్ పై తెలంగాణ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: