బయ్యర్లకు టెన్షన్ గురి చేస్తున్న మహేష్ మోక్షజ్ఞల సీక్రెట్ !

Seetha Sailaja
ఎన్టీఆర్ బయోపిక్ విడుదలకు సంబంధించిన కౌంట్ డౌన్ మొదలు కావడంతో ప్రస్తుతం ఈమూవీకి జరుగుతున్న బిజినెస్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ఈమూవీ డిజిటల్ రైట్స్ ను అమజాన్ సంస్థ 25 కోట్లకు కొనుగోలు చేసింది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. 

ఈమూవీకి సంబంధించి శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా బాలకృష్ణకు 45 కోట్లు అందుతున్నాయని సమాచారం. ప్రస్తుతం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం ఈ బయోపిక్ కు సంబంధించిన రెండుభాగాలు వల్ల బాలకృష్ణకు సుమారు 50 కోట్ల లాభం ఈమూవీ బిజినెస్ ద్వారా వచ్చిందని వార్తలు హడావిడి చేస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన వివిధ పాత్రలలో ఏనటీనటులు నటిస్తున్నారు అన్న విషయం ఈమూవీ నిర్మాతలు క్లారిటీ ఇస్తున్నా ఇప్పటికీ ఈసినిమాలో ఎన్టీఆర్ కొడుకుగా బాలకృష్ణ పాత్రకు సంబంధించి  ఎవరు నటించారు అన్న విషయమై ఇప్పటికీ సీక్రెట్ కొనసాగిస్తున్నారు. దీనితో యంగ్ బాలయ్య పాత్రను మోక్షజ్ఞ నటించి ఉంటాడు అన్న రూమర్స్ మళ్ళీ హడావిడి చేయడం మొదలైంది.

ఈవిషయమై ఈసినిమా దర్శకుడు క్రిష్ ను కొందరు అడిగినప్పుడు ఈమూవీ విడుదల అయ్యేదాకా వేచి ఉండమని నవ్వుతు చెపుతూ ఉండటంతో ఈమూవీలో మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అంటూ మరొకసారి రూమర్స్ చుట్టుముడుతున్నాయి. అదేవిధంగా ఈమూవీలో సూపర్ స్టార్ కృష్ణ పాత్రను మహేష్ నటించాడనీ కేవలం సస్పెన్స్ కోసం ఈవిషయాన్ని కూడ సీక్రెట్ గా ఉంచారు అన్న ప్రచారం జరుగుతోంది. దీనితో ఈవార్తలే నిజం అయితే ఇప్పటికే ఆకాశాన్ని అంటిన ఈమూవీ క్రేజ్ తో ఈ బయోపిక్ రానున్న సంక్రాంతి సీజన్ లో ఈ మూవీ టాక్ తో సంబంధం లేకుండా అత్యంత భారీ కలక్షన్స్ రాబడుతుంది అన్న అంచనాలలో ఈమూవీ బయ్యర్లు ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: