ఎమెల్యే చింతమనేని పై సినీనటి అపూర్వ పోలీసులకు పిర్యాదు - నేపధ్యంలో ఆమె భర్త

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ తరపున దెందులూరు నుంచి ఎమ్మెల్యే గా ప్రాతినిథ్యం వహిస్తున్న చింతమనేని ప్రభాకర్, పలు అంశాల్లో వివాదాల్లో చిక్కుకున్నారు. గతంలో ఇసుక క్వారీలను అడ్డుకున్నారని మహిళా అధికారి వనజాక్షి గారిపై దాడి చేసినందుకు, చింతమనేని ప్రభాకర్‌ పై కేసు నమోదైంది. రౌడీయిజంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన అనుచరులు తనను వేధిస్తున్నారంటూ సినీనటి అపూర్వ పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది.

తెలుగు సినిమాల్లో పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కొన్ని ప్రత్యేక పాత్రలకు వ్యాంప్ క్యారెక్టర్ల కు కేరాఫ్‌ అడ్రస్ గా నిలిచిన ప్రముఖ నటి అపూర్వ. తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అనుచరులమంటూ కొందరు వ్యక్తులు తనను వేధింపు లకు గురిచేస్తున్నారంటూ, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అపూర్వ ఫిర్యాదు చేశారు. 

తనను టార్గెట్‌గా చేసుకుని చింతమనేని అనుచరులు బెదిరింపులకు రాజకీయ వేధింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ఫోన్లుచేసి అసభ్యపద జాలం తో దూషిస్తున్నారని, ఇంటి దగ్గరికొచ్చి గొడవ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత పూర్తి ఆధారాలను సైబర్ క్రైమ్ పోలీసులకు అంద జేశారు.

హైదరాబాద్‌లోని  సైబర్ క్రైమ్ పోలీసులను కలిసిన అపూర్వ, చింతమనేని అనుచరులు తనను టార్గెట్ చేశారని తెలిపారు. ఏదో యూ-ట్యూబ్ చానెల్‌లో తాను ప్రభాకర్‌ ని ఏదో అన్నాననంటూ, బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. గతంలో తన ఇంటి ముందు దిమ్మె కడుతుండగా అడ్డుకున్నందుకు కోపం పెంచుకుని, ఇప్పుడిలా వేధిస్తు న్నారని పోలీసులకు చెప్పారు. తాను తన భర్తతో గొడవలు రావడంతో విడాకులు తీసుకుని వేరేగా జీవిస్తున్నానని చెప్పారు. అయితే, చింతమనేని అనుచరులు తన భర్తను వెంటేసుకొచ్చి, తన వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా మాట్లాడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

నలుగురు వ్యక్తులు తనను టార్గెట్ చేశారని, తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు వివరించారు. అందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు అంద జేశానని అపూర్వ చెప్పారు. వారిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: