నిహారిక ‘సూర్యాకంతం’ఫస్ట్ లుక్!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నట వారుసులుగా ఇప్పటికే అరడజను మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు.  మొదటి సారిగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక హీరోయిన్ గా ‘ఒకమనసు’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఈ చిత్రం పెద్దగా విజయం కాకపోయినా..నిహారిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.  వాస్తవానికి నిహారిక బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.  ఇటీవలే 'హ్యాపీ వెడ్డింగ్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ లోను చేసింది.

కాకపోతే ఈ చిత్రం కూడా పెద్దగా కలిసిరాలేదు.  తమిళ ఇండస్ట్రీలో సైతం ఎంట్రీ ఇచ్చిన నిహారిక తాజాగా 'సూర్యకాంతం' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ చిత్రానికి  ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి నాయకా నాయికల ఫస్టులుక్ పోస్టర్ ను వదిలారు. 

న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో వున్నారు.  అయితే టైటిల్ ఆసక్తికరంగా ఉండటం..డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోన్న నిహారికకి ఈ సారైనా హిట్ పడుతుందేమో చూడాలి. ఈ చిత్రంలో నిహారిక జోడీగా రాహుల్ విజయ్ నటిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: