మహేష్ సరసన ‘లెజెండ్’భామ!

Edari Rama Krishna
ఈ సంవత్సరం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  మహేష్ బాబు కెరీర్ లో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరిన చిత్రంగా నిలిచింది.  ప్రస్తుతం మహేష్ బాబు, వంశి పైడిపల్లి కాంబినేషన్ లో ‘మహర్షి’చిత్రం తెరకెక్కుతుంది.  ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజాహెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ చిత్రం షూటింగ్  ప్రస్తుతం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

ఇక్కడ వేసిన భారీ విలేజ్ సెట్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రంలో మరో అందాలభామ మహేష్ సనసన నటిస్తుంది.  గతంలో  'లెజెండ్'.. 'పండగ చేస్కో'.. డిక్టేటర్' వంటి సినిమాల్లో రెండవ కథానాయికగా నటించిన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో మహేష్ సరసన నటిస్తుంది.  ఈ చిత్రంలో మహేష్ బాబు రెండు పాత్రల్లో కనిపిస్తారట. 

మల్టీమిలినియర్ గా మహేష్ బాబు తన స్నేహితుడి కోసం గ్రామానికి వచ్చి అక్కడ రైతులకు అండగా నిలుస్తారట. ఒక దశలో ఆయన సరసన పూజా హెగ్డే మెరిస్తే, మరో దశలో ఆయనకి సోనాల్ చౌహాన్ కనెక్ట్ అవుతుందట.  వాస్తవానికి ఈ పాత్ర కోసం మొదట మెహ్రీన్ ని అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల క్యాన్సల్ అయ్యిందట.  ఈ అదృష్ణం ఇప్పుడు  సోనాల్ చౌహాన్ ని వరించిందని చెబుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: