'96'మూవీ తెలుగు రీమేక్ డైరెక్టర్ హరీష్ శంకర్?!

siri Madhukar
ఈ మద్య తమిళ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన సినిమాలు తెలుగు లో రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే స్టార్ హీరోల సినిమాలు తెలుగు లో రిమేక్ చేసిన విషయం తెలిసిందే.  తాజాగా ఇప్పుడు మరో తమిళ హిట్ సినిమా తెలుగు లో రిమేక్ చేయడానికి సిద్దం అవుతున్నారు.  స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు, యంగ్‌ డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కనుందన్న టాక్‌ చాలా రోజులుగా వినిపిస్తోంది. దాగుడు మూతలు పేరుతో ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా దాదాపుగా ఫైనల్‌ అయినట్టుగా ప్రచారం జరిగింది. 

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆ మద్య తమిళంలో సూపర్ హిట్ అయిన ‘96’ని తెలుగు లో రిమేక్ చేయబోతున్నాడని..కాకపోతే అప్పుడు దర్శకుడు ఎవరూ అన్న విషయం అనౌన్స్ చేయలేదు. అయితే ఈ ప్రాజెక్ట్‌కు హరీష్ శంకర్‌ దర్శకత్వం వహించనున్నారట. గతంలో గబ్బర్‌సింగ్‌తో రీమేక్‌ను తెరకెక్కించిన అనుభవం ఉన్న హరీష్ 96కు దర్శకత్వం వహించటం దాదాపు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది.ఆ మద్య అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు .. హరీశ్ శంకర్ కాంబినేషన్లో  వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్' అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మాస్ అంశాల పరంగా మాత్రం మంచి మార్కులే తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ కాలేదు. 

తాజాగా ఆయన '96' తెలుగు రీమేక్ ను హరీశ్ శంకర్ తో చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. ఇటీవల తమిళంలో విడుదలైన '96' మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే.  ఈ సినిమాలో విజయ్ సేతుపతి .. త్రిష జంటగా నటించారు. హరీశ్ శంకర్ చేతిలో ఈ ప్రాజెక్టును పెట్టాలనే ఉద్దేశంతో దిల్ రాజు వున్నాడని అంటున్నారు. కాగా, హరీష్ 96కు దర్శకత్వం వహించటం దాదాపు కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: