"గీత గోవిందం" - యూఎస్ లో $ 2 మిలియన్లు వసూళ్ళతో "విజయ్" విహారం

విజయ్ దేవరకొండ, తాజా కథానాయకుల్లో మేటి. ముఖ్యంగా మూడు సిన్మాల్తోనే స్టార్ స్టాటుస్ తెచ్చుకున్న టాలీవుద్ హీరో. అవే పెళ్ళిచూపులు సినిమాతో నటలో ఈజ్ చూపించాడు. అర్జున్ రెడ్డి సినిమా ఓ రేంజ్ కు వెళ్ళింది. తాజాగా నటించిన "గీత గోవిందం" సినిమాల్లో ఉంది. హిట్ టాక్ రావడంతో మొదటి రోజు నుండే  వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ విషయంలో గీత గోవిందం దూకుడే వేరు. 


ఇప్పటికే ₹40 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా ఇప్పుడు అరవై కోట్ల దిశగా పరుగులు తీస్తోందని సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ సినిమా ఈ రేంజ్ లో సక్సెస్ అవుతుందని నిర్మాతలు చివరకు యూనిట్ కూడా ఊహించలేదట. అర్జున్ రెడ్డి ప్రభంజన విజయం తరువాత విజయ్ దేవరకొండ నటించిన సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు తారస్థాయికి చేరుకొన్నాయి. అయితే దానికి తగ్గట్లే నిర్మాతలు గీత గోవిందం సినిమా ప్రమోషణ్ చేసిన తీరుతో ఆ క్రేజ్ మరింత పెంచేశారు.

గీత గోవిందం విడుదల సమయానికి సినిమా పై అతి భారీ ఉత్సుకత (హైప్) జనాలకు  ఏర్పడింది. అయితే ఆ అంచనాలకు మించి గీత గోవిందం విజయపథాన పయనించటం ఆ సక్సెస్ రేంజ్ కూడా ఈ యువతరం నటులెవరికీ సాధ్యం కానంతగా దూసుకుపోవటం చిత్ర యూనిట్ సభ్యులకు దర్శక నిర్మాతలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. 


ఇప్పుడు ఈ వారం విడుదలైన సినిమాలన్నింటికీ నెగెటివ్ టాక్ రావడం కూడా గీత గోవిందానికి కలిసొస్తుంది. ₹14 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ₹60 కోట్ల దిశగా పరుగులు తీయడం మామూలు విషయం కాదు. దీనికి డిజిటల్, శాటిలైట్ రైట్స్ పై ఆదాయం అదనం. ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమాగా ఈ యువ నటుడు నటించిన "గీత గోవిందం" చరిత్రలో నిలిచిపోతుంది. 
ఇప్పటికే ఈ సినిమా కొన్న బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లో మునిగి తేలుతున్నారు.

ఇక ఈ సినిమా ఆగష్ట్ 15 స్వాతంత్రదినం నాడు విడుదలై,  నేటికి 10 రోజులు గడుస్తున్నా వసూళ్ళ పరంగా ఒక ప్రక్క ఓవర్సీస్ లోనే రెండు మిలియన్ డాలర్లు దాటి ఆపై కూడా ప్రభంజనం కొనసాగుతూనే ఉంది.  ఈ తాజా తరం హీరోలు ఎవరూ చేరని స్థాయికి అంటే "టూ మిలియన్ డాలర్ల క్లబ్" లో చేరిన హీరో విజయ్ దేవరకొండ 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: