మారి పోయిన వెన్నెల కిషోర్ ప్రవర్తన !

Seetha Sailaja
బ్రహ్మనందం హవా తగ్గిపోవడంతో అతడి స్థానానికి చేరుకోవడానికి అనేకమంది కమెడియన్స్ ప్రయత్నిస్తున్నారు. పృధ్వీ శ్రీనివాసరెడ్డి సప్తగిరి లతో పాటు వెన్నెల కిషోర్ కూడ బ్రహ్మీ పొజిషన్ కు టార్గెట్ చేస్తున్నాడు. అయితే చాలామంది కమెడియన్స్ హీరోలుగా మారాలని ప్రయత్నిస్తున్న నేపధ్యంలో ఇప్పుడు అందరి ఆప్షన్ వెన్నెల కిషోర్ పైనే ఉంది. 

ప్రస్తుతం వెన్నెల కిషోర్ క్రేజ్ పీక్స్ మీద ఉండటంతో మరికొన్ని సంవత్సరాలు ఇతడి హవా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. అయితే అనుకోకుండా ఈ కమెడియన్ కు అతడి మిత్ర బృందం కారణంగా ఇండస్ట్రీలో చెడ్డపేరు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ హడావిడి చేస్తున్నాయి.  

‘గూఢచారి’ ‘చి.ల.సౌ’ ‘గీత గోవిందం’ సూపర్ సక్సస్ తరువాత వెన్నెల కిషోర్ మ్యానియా విపరీతంగా పెరిగిపోవడంతో చాల సినిమాలలో ఈ కమెడియన్ ను పెట్టి అతడి మ్యానియాతో తమ సినిమాలను హిట్ చేయాలని చాలామంది దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఈసందర్భంలో ప్రస్తుతం వెన్నెల కిషోర్ మిత్ర బృందం కలుగ చేసుకుని ఓ బ్లాక్ సెపరేట్ గా పెట్టమని అతడిని ప్రత్యేకంగా హైలైట్ చేయమని సిఫార్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు ఇప్పటికే వెన్నెల కిషోర్ సినిమాలకు సంబంధించి తీసిన సీన్లలో కొన్నింటి పట్ల అభ్యంతరాలు చెబుతూ ఇన్ డైరెక్ట్ గా తమ ప్రాభవాన్ని చూపెడుతున్నట్లు టాక్. దీనితో ఈఅనుకొని పరిణామం చాలామంది దర్శక నిర్మాతలకు తల నొప్పిగా మారింది అని అంటున్నారు. వాస్తవానికి వెన్నెల కిషోర్ మంచి కమెడియన్ గా చాల ప్రశంసలు పొందుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఇటువంటి నెగిటివ్ వార్తలు అతడి పై హడావిడి చేయడం ఏమంత మంచిది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జరుగుతున్న పరిణామాలకు వెన్నెల కిషోర్ వ్యూహాత్మకంగా చెక్ పెట్టకపోతే అతడి కెరియర్ కు ప్రమాదం అంటూ కొందరు ఇండస్ట్రీలో కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: