చిరంజీవి పాత్ర కోసం మహేష్ ప్రాకులాట !

Seetha Sailaja
పవన్‌ కళ్యాణ్‌ సినిమాలకు దూరమై రాజకీయాల బాట పట్టడంతో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ హీరోలలో అగ్రజుడిగా మహేష్‌ మారిపోయాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సీనియర్ హీరోలను పక్కకుపెడితే ప్రస్తుత తరం స్టార్ యంగ్ హీరోలలో మహేష్ తరువాత ఉన్న స్టార్ యంగ్ హీరోలు అంతా మహేష్ కన్నా వయసులో చిన్నవాళ్ళు. దీనితో మారిన పరిస్తుతులను దృష్టిలో పెట్టుకుని మహేష్ ఇండస్ట్రీ ‘పెద్దన్న’ పాత్రను వ్యూహాత్మకంగా చిరంజీవి వద్ద నుండి తీసుకుని అడుగులు వేస్తున్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

గతంలో మహేష్ తన బావ సుధీర్ బాబు సినిమాలకు తప్పించి మరి ఎసినిమాల పైనా కామెంట్స్ చేసేవాడు కాదు. ఇప్పుడు మహేష్ పూర్తిగా మారిపోయి చాల చిన్న సినిమాలకు తనంతట తానుగా ప్రశంసలు కురిపిస్తూ ఆచిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతున్నాడు. ఇటీవలి కాలంలో మహేష్ తనకు సంబంధంలేని చాలా సినిమాల గురించి స్పందించాడు. 

టాలీవుడ్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘గీత గోవిందం’ తో పాటు దాని కంటే ముందు వచ్చిన ‘గూఢచారి’ గురించి పొగడ్తలు గుప్పిస్తూ ట్వీట్లు చేశాడు. అంతకుముందు ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ లాంచ్ చేసి ఆమూవీని ప్రమోట్ చేస్తే అంతకంటే ముందు విశాల్ డబ్బింగ్ సినిమా ‘అభిమన్యుడు’ గురించి కూడా ట్వీట్ చేశాడు. ఇలా ప్రతినెల ఎదో ఒక సినిమా గురించి మహేష్ కామెంట్స్ చేస్తూ తాను అందరివాడిని అని తెలుపుకోవడానికి తాపత్రయ పడుతున్నాడు. 

మహేష్ లో వచ్చిన ఈమార్పులు చూసిన వారు నిజంగా మహేష్ మారిపోయాడా లేదంటే ఈమధ్య కాలంలో యంగ్ డైరెక్టర్స్ హవా పెరిగిన నేపధ్యంలో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తున్న యంగ్ డైరెక్టర్స్ ను తనకు ఒక మంచి కథ చెప్పమని వ్యూహాత్మకంగా ప్రోత్సహిస్తున్నాడా అంటూజోక్స్ పడుతున్నాయి.  గతంలో చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ పట్ల అదేవిధంగా యంగ్ హీరోల పట్ల అనుసరించిన వ్యూహాన్ని ఇప్పుడు మహేష్ అనుసరిస్తూ ఉండటంతో చిరంజీవి తరువాత పెద్దన్న పాత్ర కోసం మహేష్ పోటీ పడుతున్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: