అరవింద సమేత కు బోయపాటి మ్యానియా !

Seetha Sailaja
త్రివిక్రమ్ మాటలకు ఒక విభిన్న శైలి ఉంది. సందర్భానుసారం తన మూవీలోని పాత్రల నోటి వెంట కామెడీ చేయించడంలో త్రివిక్రమ్ దిట్ట. అయితే ఇప్పటి వరకు త్రివిక్రమ్ తీసిన సినిమాలు అన్నీ సున్నితమైన సంభాషణలతో ఫ్యామిలీ సినిమాలుగా ఉన్నాయి కానీ పూర్తి ఊర మాస్ సినిమాలు తీసిన ట్రాక్ రికార్డు త్రివిక్రమ్ కు లేదు. 

అయితే మొట్టమొదటి సారి జూనియర్ తో తనకు అలవాటు లేని పూర్తి మాస్ సినిమాను ‘అరవింద సమేత’ గా తీస్తున్నాడు. జూనియర్ కు మాస్ సినిమాలు కొత్త కాదు కానీ త్రివిక్రమ్ కు ఇలాంటి సినిమాలు తీయడం కొత్త. దీనితో ‘అరవింద సమేత’ లో త్రివిక్రమ్ సీన్స్ టేకింగ్ ఎలా ఉంటుందో అన్న సందేహాలు కొందరికి ఉన్నాయిసాధారణంగా త్రివిక్రమ్ సినిమాల టీజర్ ఒక పంచ్ డైలాగ్ తో ఎండ్ అవుతుంది.

అయితే ఈసారి ‘అరవింద సమేత’ కోసం తయారు చేసిన టీజర్ లో త్రివిక్రమ్ తన శైలికి భిన్నంగా జూనియర్ చేత మాస్ డైలాగులు చెప్పించి తాను మారిపోయాను అంటూ సంకేతాలు ఇస్తున్నాడు. ఈ టీజర్ ను చూసిన వారు ఎన్టీఆర్ ను మాస్ హీరోగా మరొకసారి చూపించడానికి త్రివిక్రమ్ బోయపాటి స్టైల్ ను ఎంచుకున్నాడ అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు.

బలమైన కత్తిని చూపెడుతూ ఆతరువాత జూనియర్ తన పదునైన కత్తితో అరటి చెట్లను నరుకు కుంటూ శత్రువుల పైకి దూసుకు వెళ్ళుతున్న జూనియర్ లుక్ ను చూసిన వారు ఈమూవీకి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అనుకోవాలా లేదంటే బోయపాటి వినాయక్ లు అని అనుకోవాలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 
ఈ కామెంట్స్ ఎలా ఉన్నా నిన్న విడుదలైన ‘అరవింద సమేత’ టీజర్ కు  కేవలం గంటలోపే 1. 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకోవడం షాకింగ్ గా మారింది. త్రివిక్రమ్ తన పెన్నుకు మరింత పదును పెడుతూ రాయలసీమ డైలాగ్స్ రాసి అదే యాసలో ఎన్టీఆర్ చేత పలికించడం జూనియర్ అభిమానులకు పండుగగా మారడంతో త్రివిక్రమ్ పూర్తిగా తన శైలిని మార్చుకుని తాను కూడ మాస్ మసాలా సినిమాలు తీయగలను అన్న సంకేతాలు ఇచ్చే స్థాయిలో ఉండటంతో త్రివిక్రమ్ లో బోయపాటి ఉన్నాడా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: