జగపతి బాబు స్టార్ స్టేటస్ పై జాతీయమీడియా ఆసక్తికర కధనం !

Seetha Sailaja
ఫ్యామిలీ చిత్రాల హీరోగా కొన్ని సంవత్సరాల పాటు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీని షేక్ చేసిన జగపతి బాబు ఆతరువాత తన హీరో స్తానాన్ని కోల్పోయి అనేక సమస్యలలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే ఊహించని విధంగా బాలకృష్ణ బోయపాటిలు జగపతి బాబుకు అదృష్ట దేవతలుగా మారి ‘లెజెండ్’ లో నెగిటివ్ రోల్ కు అవకాసం ఇవ్వడంతో ఇక అక్కడి నుండి జగపతి బాబు విలన్ కెరియర్ ఎవ్వరు ఊహించని విధంగా తారా స్థాయిలోకి దూసుకు పోతూనే ఉంది. 

ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా పేరు తెచ్చుకున్న ‘రంగస్థలం’ ‘గూఢచారి’ సినిమాల విజయంలో జగపతి బాబు నెగిటివ్ పాత్ర సృష్టించిన సంచలనాలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే కోట్లమీద పారితోషికం తీసుకుంటూ తెలుగు కన్నడ మలయాళ తమిళ సినిమాలలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన జగపతి బాబు ఇప్పుడు నేషనల్ స్టార్ గా కూడ మారిపోతున్నాడు. 

త్వరలోనే జగపతి బాబు విలన్ పాత్రలో నటిస్తున్న భోజ్ పురి, పంజాబీ భాషల సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. అదేవిధంగా ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ త్వరలో ప్రారంభించ బోతున్న ఒక భారీ సినిమాలో జగపతి బాబును నెగిటివ్ పాత్రకు ఎంపిక చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దక్షిణాది భాషలలోని అందరి విలన్స్ కంటే జగపతి బాబు అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడని ఆపత్రిక తన కథనంలో పేర్కొంది. 

ప్రస్తుతం ఈ విలక్షణ విలన్ ‘అరవింద సమేత’ ‘సైరా’ మూవీలలో పూర్తి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటిస్తున్నాడు. అదేవిధంగా వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జీవితం పై తీస్తున్న ‘యాత్ర’ బయోపిక్ లోరాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్రను పోషిస్తూ ఉండటం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుత పరిస్థుతులలో రాబోతున్న కాలంలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మోస్ట్ వాంటెడ్ విలన్ గా జగపతి బాబు మారబోతున్నాడు అంటూ ఆపత్రిక కథనం వ్రాసింది అంటే జగపతి బాబు అదృష్టం ప్రస్తుతం ఏవిధంగా పరుగులు తీస్తోందో అర్ధం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: