అల్లుఅర్జున్ భయం వెనుక బయటపడుతున్న కారణాలు !

Seetha Sailaja
తన తదుపరి సినిమా ప్రకటన గురించి మరి కాస్త ఓపిక పట్టండి అంటూ అల్లు అర్జున్ తన అభిమానులకు చేసిన ట్విట్ వెనుక పెద్ద వ్యవహారమే నడిచింది అంటూ వార్తలు వస్తున్నాయి. ‘నా పేరు సూర్య' కు ముందు వచ్చిన అల్లు అర్జున్‌ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా కనీసం ఆ సినిమాలకు ఓపెనింగ్స్ అయినా బాగా వచ్చాయి.

అయితే ‘నాపేరు సూర్య’ కు కనీసం ఓపెనింగ్స్ కలెక్షన్స్ కూడ సరిగ్గా రాకపోవడం అల్లు అర్జున్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది అని అంటున్నారు.  గతంలో అల్లు అర్జున్ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినా యూత్ అదేవిధంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ కనీసం ఒక్కసారి అయినా ఆసినిమాను చూసేవారు. 

అయితే ఈఅంచనాలు అన్ని తేడా కొట్టడంతో ‘సూర్య’ ఘోరమైన ఫ్లాప్ గా మారిపోయింది. దీనితో బన్నీలో అంతర్మధనం ప్రారంభం అయింది అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికితోడు  ‘రంగస్థలం’ తో రామ్‌ చరణ్‌ ఫుల్‌ ఫామ్‌లోకి రావడం మహేష్‌ ఎన్టీఆర్‌ ప్రభాస్ ఇలా అందరు టాప్ హీరోలు తమ స్టార్‌ డమ్‌ ను నిలుపుకోవడంతో అల్లు అర్జున్‌ ఇప్పుడు మరో ఫ్లాప్ ను ఎదుర్కునే సాహసం చేయలేకపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే బన్నీతో సినిమా చేయవలసిన విక్రమ్‌ కుమార్‌ పలు కథలు వినిపించినా అల్లు అర్జున్‌ కి ఏకథ పైనా పూర్తిగా నమ్మకం కుదరడం లేదు అని అంటున్నారు. విక్రమ్‌ కుమార్ మంచి దర్శకుడే అయినప్పటికీ అతని చిత్రాలకి కమర్షియల్‌ సక్సస్స్ తక్కువ. అయితే అతని సినిమా అంటే మాస్ ప్రేక్షకులు  ప్రయోగాత్మక సినిమా అని భావించే పరిస్థితులలో విక్రమ్ కుమార్ తో సినిమాను చేయడం కంటే మరో టాప్ డైరెక్టర్ తో సినిమా చేయడం మంచిది అని బన్నీ భావిస్తున్నాడు. కానీ బన్ని వైపు ప్రస్తుతం ఏ టాప్ డైరెక్టర్ ఇప్పడు చూడకపోవడం బన్నీని మరింత ఆశ్చర్యపరుస్తోంది అని టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: