మెగా ఫ్యామిలీ ఒత్తిడిని తట్టుకోలేక పోతున్న చరణ్ !

Seetha Sailaja
మెగా ఫ్యామిలీలో స్టార్‌ డమ్‌ కి భీకరమైన కరువు వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ మొదలయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువమంది హీరోలున్న కుటుంబంగా మెగా ఫ్యామిలీ రికార్డు క్రేయేట్ చేసినా  గతకొంత కాలంగా   మెగా హీరోల సినిమాలు చాలవరకు పారాజయం పొందుతున్న నేపధ్యంలో  పరిశ్రమను శాసించే స్థాయి నుంచి మెగాహీరోలు కొద్దికొద్దిగా జారుకుంటున్నారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఈ ఏడాది మెగా హీరోలు నటించిన సినిమాల లిస్టును తీసుకుంటే ఒక్క రామ్ చరణ్ ‘రంగస్థలం’ మినహా మిగతా మెగా టాప్ హీరోల సినిమాలు అన్నీ బాక్స్ ఆఫీస్ మధ్య చతికల పడుతున్న నేపధ్యంలో మెగా  అభిమానుల గుండె తరుక్కుపోతోంది. మెగా ఫ్యామిలీలో ఈవిధమైన పరిస్థుతులు గతంలో ఎప్పుడూ లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈఎడాది మెగా ఫ్యామిలీ అకౌంట్ ను పవన్ ‘అజ్ఞాతవాసి’ తో మొదలు పెడితే అది ఘోరమైన డిజాస్టర్ గా మారింది. 

దీనికితోడు గత కొంతకాలంగా బన్నీకి హిట్లు లేవుసరికదా సమ్మర్ కు వచ్చిన ‘నాపేరు సూర్య’ ఘోరమైన ఫ్లాప్ గా మారింది ఇక సాయి ధరమ్ తేజ్ హ్యాట్రిక్ పరాజయాలతో ఇండస్ట్రీ ఫ్లాప్ హీరోగా ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేసాడు. వరుణ్ తేజ్ ఖాతాలో సోలో హిట్లు లేవు. ఈ ఏడాది వచ్చిన ‘తొలి ప్రేమ’ హిట్ టాక్ ను తెచ్చుకున్నా అది మెగా అభిమానులు కోరుకునే స్థాయి హిట్ కాదు. అల్లు శిరీష్ పేరుకు హీరో అయినా  రెగ్యులర్ హీరో స్టేటస్ ను దక్కించుకోలేకపోతున్నాడు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ట్రంప్ కార్డ్ లాంటి పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి పూర్తిగా విరామం తీసుకున్న పరిస్థుతులలో పవర్ స్టార్  ఎప్పటికి  మేకప్ వేసుకుంటాడాడో అతడికే తెలియని పరిస్థితి. 
 

ఇలాంటి పరిస్థుతులలో ఈఏడాది చరణ్ నటించిన ‘రంగస్థలం’ మినహా మరే సినిమా మెగా అభిమానులు గర్వపడేలా లేదు. లేటెస్ట్ గా విడుదలైన కళ్యాణ్ దేవ్ ‘విజేత’ సినిమా వైపు మెగా అభిమానులు కూడ రాని నేపధ్యంలో మెగా హీరోల ఓపెనింగ్ కలక్షన్స్ స్టామినా తగ్గిపోతోందా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ లేటెస్ట్ గా నటిస్తున్న బోయపాటి మూవీ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మల్టీ స్టారర్ పై అంచనాలు భారీగానే ఉన్నా ఒక్క చరణ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్లు ఎంతవరకు మిగతా మెగా హీరోల ఫ్లాప్ లను కవర్ చేస్తూ మెగా కుటుంబ ఆదిపత్యాన్ని ఇండస్ట్రీలో కొనసాగిస్తుంది అంటూ ఈ ఏడాది మెగా కుటుంబ హీరోల సినిమాల పరిస్థితి పై అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: