రమ్యకృష్ణ షాకింగ్ రెమ్యూనరేషన్

ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు  హీరోల రెమ్యూనరేషన్  కన్నా ఇతర నటీ నటుల పారితోషికమే ఎక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వారి కోసం ప్రత్యేక షెడ్యూల్ సెట్ చేసుకుంటున్న దర్శకులు కూడా ఉన్నారు. రోజుకు లక్షల్లో ఛార్జ్ చేసే వారి సంఖ్య చాలానే ఉంది. కమెడియన్స్ చాలానే అందుకుంటున్నారు. ఇప్పుడు కమెడియన్ గా మరీన సునీల్ అయితే రోజుకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు అందుకుంటున్నాడు.

 

ఇక సీనియర్ యాక్టర్ నరేష్ రోజుకి ₹1.50 లక్షలు అందుకుంటున్నారు. వెన్నల కిషోర్ కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. స్టార్ కమెడియన్స్ లో అతనికి ఆదరణ ఎక్కువగా ఉంది.  దాదాపు రోజుకి ₹2.00 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. రావు రమేష్ అయితే ₹2.50 లక్షల ఉంటుందట. వీరందరికి కాల్షీట్స్ బట్టి కూడా ఒక రౌండ్ ఫిగర్ అమౌంట్ ఉంటుందని ఒక టాక్ ఉంది. అయితే చాలా వరకు డైలీ పేమెంట్స్ కే వీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని తెలుస్తోంది. అసలు విషయంలోకి వస్తే టాలీవుడ్ "శివగామి రమ్యకృష్ణ" కు బాహుబలి తరువాత డిమాండ్ నింగిని తాకేంతగా పెరిగి పోయింది.

 ప్రస్తుతం ఆమె అక్కి నేని నాగచైతన్య చేస్తున్న "శైలజారెడ్డి అల్లుడు" సినిమాలో టైటిల్-రోల్ చేస్తుంది. అందుకు 25 కాల్షీట్స్ తీసుకున్న చిత్ర యూనిట్ రోజుకి ₹6.00 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ ఫిక్స్ చేసుకున్నారట. అంటే మొత్తంగా ₹1.50 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుతోందని సమాచారం. కొంతమంది మాత్రం 45 లాల్షీట్స్ అంటున్నారు అదే నిజమైతే అదే సినిమాలో హీరోయిన్ గా నటించే నటి కంటే చాలా ఎక్కువే ఉండొచ్చు. ప్రస్తుతం రోజువారీ పారితోషికం తీసుకునేవారిలో రమ్యకృష్ణే ముందున్నారని అంటున్నారు.

 

"బాహుబలి శివగామి" పాత్ర పోషించిన తరవాత రమ్యకృష్ణ క్రేజ్ రెండింతలైంది. దాంతో ఇటు తెలుగు, అటు తమిళం నుంచి కీలకమైన రోల్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి అనేకంటే ఆమెను చుట్టుముడుతున్నాయి అనటం కరక్టేమో? వరుస సినిమాలతో ఆమె ఫుల్-బిజీ అయ్యారు. కథలో బరువైన, బలమైన, గంభీరమైన మగువ పాత్ర ఉంటే చాలు నిర్మాతల దర్శకుల మదిలో మెదిలే నటి రమ్యకృష్ణ నే. ఆమె ఎంత పారితోషికాన్ని అడిగినా వెనకడుగు వేయకుండగా ఇచ్చేస్తున్నారు. ₹40.00 లక్షలు హీరోయిన్.అను ఇమ్మాన్యుయేల్ పారితోషికమని తెలుస్తుంది

 

రకుల్ ప్రీత్ లాంటి హీరోయిన్స్ ఒక కోటి రుపాయల వరకు తీసుకుంటున్నారు. తమన్నా ఫెడవుట్ తరువాత ₹60.00 లక్షలు తీసుకుంటోంది. వారందరికంటే రమ్యకృష్ణ మాత్రం ఎక్కువగా తీసుకోవడం చూస్తుంటే ఆమె హీరోయిన్స్ కంటే సినిమాకు చాలా అవసరం అని అర్ధమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: